Asianet News TeluguAsianet News Telugu

Guppedantha Manasu: దేవయానికి బుద్ధి చెప్పిన వసుధార.. రిషి కాలేజీ పరువు తీయాలనుకుంటున్న ధర్మరాజు?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 24వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

Dharmaraju devises a plan to ruin rishis college in todays guppedantha manasu serial gnr
Author
First Published Mar 24, 2023, 7:00 AM IST

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార నిద్రలేవగా ఇంతలో దేవయాని అక్కడికి ఉండగా మేడమ్ అనడంతో ఇన్ని రోజులకు మీ స్థానాన్ని కరెక్ట్ గా ఎంచుకున్నావు అని అనగా ఇంతలో జగతి అక్కడికి వచ్చి ఏంటి వసుధార సోఫాలో పడుకున్నావు అనగా రిషి సార్ నా గదిలో పడుకున్నారు మేడం అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడికి వచ్చాను అని అంటుంది. అప్పుడు దేవయాని మీ స్థానం ఇక్కడే వసుధార అనడంతో ఎవరి స్థానం ఏంటో తెలియకుండా మాట్లాడకూడదు మేడం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు కదా అని అంటుంది.

నేను సోఫాలో పడుకుంటే నా స్థానం సోఫాలో అని మీరు అనుకుంటున్నారు కానీ నా స్థానం రిషి సార్ మనసులో ఉంది అని అంటుంది వసు. చూసావా జగతి నీ కోడలికి ఎంత ధైర్యమో అనడంతో అవును మేడం నాకు కోపం ధైర్యం రెండు ఎక్కువే అని అంటుంది. ఇప్పుడు మీరు ఏదో సాధించారని నేను ఏదో పోగొట్టుకున్నానని మీరు సంతోష పడకండి నాకు దక్కాల్సినవి దక్కుతాయి అంటూ దేవయానికి స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతుంది వసుధార. నాకు రిషి సార్ కి మధ్యలో ఎవరైనా వస్తే వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు మేడం అని అంటుంది వసుధార. కొందరి గురించి నిజాలు తెలిస్తే ఎవరి స్థానాలు గల్లంత అవుతాయో నాకు బాగా తెలుసు అనడంతో అని దేవయానికీ బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

అప్పుడు జగతి నా కోడలు మీ కోడలా కాదు అక్కయ్య ఒక మాట అంటే పది మాటలు అంటుంది అని అనడంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కాలేజీకి ధర్మరాజు అని స్పాట్ వాల్యుయేషన్ ఇంచార్జ్ వస్తాడు. ఆ తర్వాత స్పాట్ వాల్యుయేషన్ కి సంబంధించిన పనులు అన్ని జగతి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆ ధర్మరాజు ఫణింద్ర ఇద్దరు స్పాట్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి స్పాట్ వాల్యుయేషన్ దగ్గర అన్ని సరిగా జరుగుతున్నాయో లేదో అని చూస్తుండగా ఇంతలోనే అక్కడికి ధర్మరాజు వచ్చి ఎలా అయినా తప్పుచేసి ఈ కాలేజీని ఇరికించాలి వీళ్ళ పని చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు.

 ఆ తర్వాత ధర్మరాజు తో మాట్లాడుతూ ఉండగా అప్పుడు ధర్మరాజు మహేంద్ర అక్కడే పెట్టిన కీస్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇంతలో జగతి వచ్చి ఒక్క నిమిషం ఇలా రా మహేంద్ర అనడంతో మహేంద్ర వెళ్లి ఆ ఫైల్స్ చూస్తూ ఉండగా ఎలా అయినా అ కీస్ తీసుకోవాలి అనే ధర్మరాజు చూస్తూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర జగతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ధర్మరాజు ఆ కీస్ తీసుకొని దాని ముద్రను ఒక పేపర్ పై వేసుకుంటాడు. ఇప్పుడే వస్తాను మహేంద్ర సార్ ఆలోపు నేను వెళ్లి నా డూప్లికేట్ కి తెచ్చుకొని వీళ్ళ పని చెప్తాను అని మనసులో అనుకుంటూ వెళ్తుండగా రిషి ఎదురుపడతాడు.

ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జగతి, మహేంద్ర రిషి అందరూ కలిసి ఆ స్పాట్ వాల్యూషన్ దగ్గర నుండి చూస్తూ ఉంటారు. ఇంతలోనే ధర్మరాజు అక్కడికి వచ్చి పేపర్స్ పెట్టి వేసి రూమ్ క్లోజ్ చేద్దామా అనగా సరే సరే అని చెప్పి అందరూ కలిసి రూమ్ లోకి వెళ్తారు. ఆ తర్వాత అందరూ కలిసి పేపర్స్ ని దగ్గర నుండి చూసి గదికి సీల్ వేస్తారు. ఆ తర్వాత మహేంద్ర ఫైల్స్ చూస్తూ ఉండగా ఇంతలో జగతి రిషి వచ్చి వెళ్దాం పద అని అనడంతో మహేంద్ర సరే వెళ్దాం పద అని అంటాడు. అప్పుడు వసుధార  రాకపోవడంతో అందరూ ఆలోచనలో పడతారు. అప్పుడు వసు కోసం నేను వెళ్ళొస్తాను అని జగతి వెళుతుంది. మరోవైపు ధర్మరాజు గది తాళం తీసి లోపలికి వెళ్లి కొన్ని పేపర్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. 

అప్పుడు గదికి తాళం వేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇంతలో జగతి అక్కడికి వచ్చి అది చూసి ఒకసారిగా షాక్ అవుతుంది. వసు కూడా షాక్ అవుతుంది. తాళం ఓపెన్ చేసి సీల్ పక్కన పడేసి ఉండడంతో అది చూసి ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు వసు రిషి కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పగా మహేంద్ర రిషి ఇద్దరు అక్కడికి వస్తారు. అప్పుడు గది తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా అక్కడ మూడు బండల్స్ లేకపోవడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు జగతి తన చేతిలో ఉన్న కీస్ కి సబ్బు అంటుకోవడంతో కిస్ కి సబ్బు అంటుకుంది అనగా ఈ పని ఎవరు చేశారో నాకు బాగా తెలుసు వెళ్దాం పదండి అని అంటాడు రిషి.

Follow Us:
Download App:
  • android
  • ios