పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ధనుష్ లేటెస్ట్ మూవీ కుబేర జూన్ 20న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్ర సెన్సార్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.  

కుబేర సెన్సార్ కంప్లీట్ 

పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ధనుష్ లేటెస్ట్ మూవీ కుబేర జూన్ 20న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సార్భ్ కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ పొందింది. అయితే, CBFC మొత్తం ఈ చిత్రంలో 19 కట్స్ చెప్పినట్లు సమాచారం. దీంతో సినిమా మీద ఆసక్తి మరింతగా పెరిగింది.

19 కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డు 

ప్రస్తుతం సినిమా ఫైనల్ నిడివి 181 నిమిషాలుగా నమోదైంది. మొదటగా చిత్ర యూనిట్ 195 నిమిషాల వెర్షన్‌ను సెన్సార్‌కు సమర్పించారు. తాజాగా 14 నిమిషాల పాటు 19 కత్తెర్లు పెట్టడం, చిత్రం కథనంపై అనేక ప్రశ్నలు రేపుతోంది. 19 కట్స్ ఉండేలా శేఖర్ కమ్ముల ఏం చేశారు.. ఎలాంటి బోల్డ్ సన్నివేశాలు చిత్రీకరించారు అనే ప్రశ్న మొదలైంది. ఈ చిత్రం దేశ వ్యవస్థని, సిస్టన్ ని ప్రశ్నించే విధంగా ఉంటుందని నిర్మాతలు ఇప్పటికే తెలిపారు. దీనితో శేఖర్ కమ్ముల ఏవైనా వివాదభరిత సన్నివేశాలు చిత్రీకరించారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ధనుష్ ఈ చిత్రంలో బిక్షగాడి పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే, కుబేరా అడ్వాన్స్ బుకింగ్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే యుఎస్ లో 2,000 టిక్కెట్లు అమ్ముడై, 36,200 డాలర్లు వసూలు చేసినట్టు సమాచారం.

ధనుష్ ఈ చిత్రంలో వివిధ గెటప్స్ లో కనిపించబోతున్నారు. శేఖర్ సార్ అద్భుతంగా పనిచేశారు. ఆయన నాకు వర్క్ ని చాలా సులభతరం చేశారు,” అని ధనుష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ సినిమా షూటింగ్ అనుభవం గురించి మాట్లాడుతూ, “డంప్ యార్డ్స్, చెత్త ట్రక్కుల్లో షూటింగ్ చేశాం. ప్రతి అనుభవం ఏదో ఒక పాఠం నేర్పుతుంది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది,” అని తెలిపారు.

ఈ చిత్రంలో దలీప్ తాహిల్, సాయాజీ షిండే ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.

వివాదస్పదంగా మారిన ఈ సెన్సార్ కత్తెర్లు, కథపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఫైనల్ వెర్షన్ థియేటర్లలో ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ధనుష్ కి తెలుగులో రెండో చిత్రం 

ధనుష్ కి ఇది తెలుగులో రెండవ చిత్రం. ఇప్పటికే ధనుష్ తెలుగులో సార్ అనే చిత్రంలో నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వైవిధ్యమైన శైలి కలిగిన దర్శకుడు. రెగ్యులర్ మాస్ మసాలా చిత్రాలకు ఆయన దూరం. శేఖర్ కమ్ముల తన కెరీర్ బిగినింగ్ నుంచి సున్నితమైన భావోద్వేగాలు ఉండే ప్రేమ కథా చిత్రాలు. ఫ్యామిలీ చిత్రాలు చేస్తూ వచ్చారు. మధ్యలో లీడర్ లాంటి పొలిటికల్ డ్రామా తెరకెక్కించారు.