- Home
- Entertainment
- హీరోగా ఫస్ట్ రెమ్యునరేషన్ అందుకోగానే చెక్ తీసుకెళ్లి చిరంజీవికి చూపించిన అలీ, ఎందుకో తెలుసా
హీరోగా ఫస్ట్ రెమ్యునరేషన్ అందుకోగానే చెక్ తీసుకెళ్లి చిరంజీవికి చూపించిన అలీ, ఎందుకో తెలుసా
రోడ్డు మీద వెళుతున్న అలీని చిరంజీవి కారులో ఇంటికి తీసుకెళ్లి ఒక మాట చెప్పారట. కొన్నేళ్ల తర్వాత చిరంజీవి చెప్పిన మాట నిజమైంది. అది గుర్తుపెట్టుకుని అలీ ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కమెడియన్ అలీ
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అలీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన అలీ ఆ తర్వాత టాలీవుడ్ లో తిరుగులేని కమెడియన్ గా ఎదిగారు. హీరోగా కూడా అలీ అనేక చిత్రాల్లో నటించారు. చిరంజీవి నటించిన పునాదిరాళ్లు చిత్రంతోనే అలీ కెరీర్ మొదలైంది. కానీ అలీకి గుర్తింపు తీసుకు వచ్చింది మాత్రం సీతాకోకచిలుక చిత్రం.
నాకు కూడా గ్యాప్ వచ్చింది
ఈ చిత్రంలో అలీ సొట్ట బుగ్గల పిల్లాడిగా నటించి ఆకట్టుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించిన తర్వాత అలీ టాలీవుడ్ దృష్టిలో పడ్డాడు. పెద్దయ్యాక 1988 నుంచి అలీకి పూర్తిస్థాయి కమెడియన్ గా అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ముగిసిన తర్వాత ప్రతి నటుడికి కొంత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ నాకు కూడా వచ్చింది. ఆ టైంలో ఇంటికి వెళ్ళిపోదాం అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ.. లేదు ఇక్కడే ఉండి సాధించాలి అని పట్టుదలతో చెన్నైలోనే ఉండిపోయాను.
చిరంజీవి గారు తన కారులో ఇంటికి తీసుకెళ్లి..
ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే పక్కనే ఆ కారు వచ్చి ఆగింది. ఆ కారులో ఉన్నది ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. నన్ను చూసి గుర్తుపట్టి కారు ఎక్కమని అడిగారు. కారులో తన ఇంటికి తీసుకెళ్లారు. మంచి జీడిపప్పు ఉప్మా పెట్టారు. ఆ తర్వాత కాఫీ కూడా ఇచ్చారు. ఏం చేస్తున్నావ్ ఇప్పుడు అని చిరంజీవి గారు నన్ను అడిగారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా అని చెప్పా. ప్రయత్నిస్తూనే ఉండు. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఒకరోజు అంటూ వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూడాలని చెప్పారు.
చెక్ తీసుకెళ్లి మెగాస్టార్ కి చూపించా
ఆ తర్వాత కమెడియన్ గా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఊహించని విధంగా యమలీల చిత్రంలో హీరోగా ఎంపికయ్యాను. హీరోగా పారితోషికం అందుకున్నాను. ఆ చెక్ అందుకున్న వెంటనే నాకు గుర్తొచ్చిన మొదటి వ్యక్తి చిరంజీవి గారు. ఆ టైంలో ఆయన ఎస్పీ పరశురామ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. షూటింగ్ జరుగుతున్న పద్మాలయ స్టూడియోస్ కి నేను అందుకున్న చెక్ తీసుకుని వెళ్లాను.
ఆయన మాటే నిజమైంది
చెక్ తీసుకెళ్లి చిరంజీవి గారికి చూపించాను. మీరు ఆరోజు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అని చెప్పారు. అదే నిజమైంది అని చిరంజీవి గారితో అన్నాను. ఆయన శభాష్ అని మెచ్చుకున్నారు. ఆ ప్రోత్సాహంతో అన్ని భాషల్లో 1200 పైగా చిత్రాల్లో నటించినట్లు అలీ తెలిపారు.హీరోగా అలీ 50 పైగా చిత్రాల్లో నటించారు.
చంటబ్బాయి చిత్ర షూటింగ్ సమయంలోనే చిరంజీవి గారు నాకు బ్రహ్మానందం గారిని పరిచయం చేశారు. ఆహ నా పెళ్ళంట చిత్రం తర్వాత బ్రహ్మానందం గారు తెలుగులో చార్లీ చాప్లిన్ గా మారిపోయారు అని ప్రశంసించారు. ఆ తర్వాత బ్రహ్మానందం గారితో నాకు ఏర్పడిన అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజు మార్చి రోజు ఫోన్ చేసి డిన్నర్ కి మీట్ అవుదాం రా అని బ్రహ్మానందం గారు పిలుస్తుంటారు అని అలీ తెలిపారు.

