ప్రమోలతో సార్ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఆ ఊపు ప్రీమియర్స్ బుకింగ్స్ లో కనిపిస్తుంది. సార్ థియేటర్స్ ఎదుట హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటూ నిర్మాతలు తెలియజేస్తున్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి తన శైలికి భిన్నంగా సోషల్ మెసేజ్ మూవీతో వస్తున్నారు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాలతో వెంకీ అట్లూరి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. మరి సార్ ట్రైలర్ చూస్తే ఎడ్యుకేషన్ సిస్టం మీద తెరకెక్కిన సెటైరికల్ సోషల్ డ్రామా అనిపిస్తుంది. అయితే రొమాంటిక్, కామెడీ యాంగిల్ వదలకుండా కథలో భాగం చేశాడు.
ఇక హీరో ధనుష్ కి తెలుగులో మార్కెట్ ఉంది. ఆయన చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. సార్ ట్రైలర్ కి మంచి ఆదరణ దక్కింది. మూవీ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రీ రిలీజ్ ఘనంగా ప్రముఖులతో నిర్వహించడం మరింత ప్లస్ అయ్యింది. ఈ ప్రచారం ఎఫెక్ట్ ఓపెనింగ్స్ మీద కనిపిస్తుంది. ఫిబ్రవరి 16 అర్థరాత్రి నుండే తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది.
సార్ ప్రీమియర్స్ బుకింగ్స్ లో సత్తా చాటిందట. థియేటర్స్ ఎదుట హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయట. ఈ మేరకు నిర్మాతలు ట్వీట్ చేశారు. ఆల్రెడీ సార్ మూవీ చూసిన క్రిటిక్స్ పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. మొత్తంగా సార్ మూవీ విషయంలో అన్నీ శుభ శకునములే అన్నట్లుంది. మరి సార్ తో తెలుగులో ధనుష్ సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సార్ తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదల కానుంది. సంయుక్త హీరోయిన్ గా నటించారు. జివి ప్రకాష్ మ్యూజిక్ అందించారు.
వెంకీ గత రెండు చిత్రాలు మిస్టర్ మజ్ను, రంగ్ దే అనుకున్న స్థాయిలో ఆడలేదు. తొలిప్రేమ మూవీతో మేకర్స్ అని ఆకర్షించిన వెంకీ అట్లూరి ఆ స్థాయి హిట్ ఇవ్వలేదు. దీంతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది వెంకీ అట్లూరి వివాహం చేసుకున్నాడు.
