హాలీవుడ్ లో హడావిడిచేశారు తమిళ స్టార్ హీరో ధనుష్. తాను నటిస్తున్న ఫస్ట్ హాలీవుడ్ మూవీ ప్రీమియర్ కు ఆయన హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ ను కాస్త స్పెషల్ గా మార్చుకున్నారు ధనుష్.
కోలీవుడ్ స్టార్ హీరో... సూపర్ స్టార్ రజనీకాంత్ తాజామాజీ అల్లుడు ధనుష్ హాలీవుడ్ ఓ తెగ హడావిడి చేసేస్తున్నారు. త్వరలో ఆయన హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ది గ్రే మ్యాన్ అనే సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు ధనుష్. యాక్షన్ సినిమాల కేరాఫ్ అడ్రస్‌గా పిలువబడే రూసో బ్రదర్స్ ఆంటోని, జో ఈ సినిమాను రూపొందించారు. అటు హాలీవుడ్ తో పాటు మన ఇండియాలో కూడా ..ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
మార్క్ గ్రీన్ రాసిన ది గ్రే మ్యాన్ పుస్తకం ఆధారంగా అదే టైటిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కరోనా వల్ల కాస్త డిలే అయినా.. ఈసినిమాను ఎలాగు కంప్లీల్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక లాస్ ఏంజెల్స్ లో ఈ సినిమా ప్రీమియర్ జరిగింది. ఈవెంట్ చిత్రయూనిట్ హాజరైంది. ది గ్రే మ్యాన్ ప్రీమియర్ ఈవెంట్‌కు ధనుష్ తన కుమారులు యాత్ర, లింగాతో కలిసి హాజరయ్యాడు.
తండ్రీ కొడుకులు ముగ్గురు ఒకే డ్రెస్ కోడ్ తో... బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ షూస్ తో.. ఈవెంట్ లోనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈవెంట్ లో ముగ్గరు కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక హీరో ధనుష్ సోషల్ మీడియాలో ఈ పిక్స్ ను షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఇక జులై 12న సెలెక్టెడ్ థియేటర్లలో మాత్రమే ది గ్రే మ్యాన్ రిలీజ్ అయ్యింది. ఇక కంప్లీట్ గా జులై 22న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. AGBO, Roth Kirschenbaum Films సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి.
ఈ మధ్య కాలంలోనే తన భార్య నుుంచి ధనుష్ విడిపోయిన విషయం తెలిసిందే. ఇక చిన్న హీరోగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి న ధనుష్.. సూపర్ స్టార్ రజనీ కాంత్ కూతురు సౌందర్యను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దాదాపు 18 ఏళ్ళకు పైగా ఎంతో అన్యోన్యంగా ... ఆదర్శంగా ఉన్న ఈ జంట ఆ మధ్యే విడాకులు తీసుకోబోతున్నట్టుప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ విషయంలో ఫ్యాన్స్ షాక్ అవ్వడమే కాదు.. వీరుమళ్ళీ కలవాలని కోరకుంటూ... సోషల్ మీడియాలో హడావిడి చేశారు.
