తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ తెలుగు లో నటిస్తున్న చిత్రం ‘సార్’(SiR). తమిళంలో ‘వాతి’గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయగా.. తాజాగా వాయిదా వేస్తూ మేకర్స్ కొత్త తేదీని ప్రకటించారు.
తమిళ హీరో ధనుష్ (Dhanush) తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న తొలిచిత్రం ‘సార్’. తమిళంలో ‘వాతి’గా రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళంలో బైలింగ్వల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్ సంస్థలు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాయి. ధనుష్ కేరీర్ లోనే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
తుది దశ షూటింగ్ సమయంలోనే ‘సార్’ చిత్రం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. తొలుత డిసెంబర్ 12న తెలుగు, తమిళంలో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ, మళ్లీ కొద్దిపాటి వాయిదాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. రిలీజ్ కు ఇంకాస్తా సమయం దొరకడంతో మరింత మెరుగ్గా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని హామీనిచ్చారు.
కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మేకర్స్ విడదల చేసిన పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. స్టూడెంట్ యూనిఫాంలో, ఫార్మల్ లుక్ లో ధనుష్ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన పోస్టర్లు కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఫస్ట్ సింగిల్’కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు ధనుషే సాహిత్య అందించడం విశేషం. ఇక ధనుష్ నటించిన మూడు చిత్రాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం మరో మూడు చిత్రాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో ‘సార్’ ఒకటి. మూవీలో హీరోయిన్ గా సంయుక్తా మీనన్ (Samyuktha Menon) నటిస్తోంది. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, హైపర్ ఆది కీలక పాత్రలో నటిస్తున్నారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
