తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్న ఏజ్ యాక్షన్ డ్రామా ‘సార్’. తెలుగు, తమిళంలో ఒకేసారి రూపుదిద్దుకుంటోంది. చిత్రం నుంచి అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇంతకీ అదేంటంటే.. 

ధనుష్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న తొలి చిత్రం `సార్‌`. తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌(తమిళంలో `వాతి`) గా తెరకెక్కుతోంది. మూవీకి దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్), శ్రీకర స్టూడియోస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో చిత్రం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కూడా పూర్తైంది. ఇదివరకే వచ్చిన ఫస్ట్ లుక్, ఇంట్రెస్టింగ్ పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. 

ఈ క్రమంలో ధనుష్ అభిమానులకు ‘సార్’ (SiR) చిత్రం నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటంటే తర్వలోనే ‘సార్’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది. చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఆయన క్రేజీ అప్డేట్ ను అందించారు. ‘త్వరలోనే వాతీ ఫస్ట్ సింగిల్ రాబోతోంది. ఈ పాటకు ధనుషే సాహిత్యం అందించారు. ఇదొక లవ్ సాంగ్’ అని అదిరిపోయే న్యూస్ ఇచ్చారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నటనతోపాటు పాటలు కూడా అద్భుతంగా పాడుతారు దనుష్. ఈ చిత్రంతతో తన సాహిత్య ప్రతిభనూ చూపించనున్నారు.

ఈ ఏడాది ఇప్పటికే ధనుష్ నటించిన మూడు చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం మరో మూడు చిత్రాలు కూడా చిత్రీకరణలో ఉన్నాయి. ఈ క్రమంలో ‘సార్’ చిత్రమే నెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 2022 డిసెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో ధనుష్‌, సంయుక్త మీనన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

Scroll to load tweet…