ఇప్పుడు ఏకంగా ధనుష్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ఆయన తెలుగు తమిళంలో ఇప్పటికే శేఖర్‌ కమ్ములతో ఓ బైలింగ్వల్‌ చిత్రాన్ని ప్రకటించారు. మరో సినిమాని కన్ఫమ్‌ చేశారు.  

తమిళ హీరోలు తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ విశాల్‌, సూర్య, కార్తి, విక్రమ్‌ వంటి హీరోలు తెలుగులో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ధనుష్‌, విజయ్‌ సినిమాలు కూడా తెలుగులో విడుదలవుతూ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ధనుష్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ఆయన తెలుగు తమిళంలో ఇప్పటికే శేఖర్‌ కమ్ములతో ఓ బైలింగ్వల్‌ చిత్రాన్ని ప్రకటించారు. దీన్ని ఏషియన్‌ సినిమాస్‌ నిర్మించనుంది. దీంతోపాటు మరో సినిమాని కన్ఫమ్‌ చేశారు. 

ధనుష్‌.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు దాన్ని కన్ఫమ్‌ చేశారు. నేడు(జు28) ధనుష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్‌ చెబుతూ సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ ధనుష్‌ కొత్త లుక్‌ని పంచుకుంది. ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సీతార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సమాచారం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం. ధనుష్‌ హీరోగా హిందీలో `అట్రాంగి రే`, ఇంగ్లీష్‌లో `ది గ్రే మ్యాన్‌` సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.

Scroll to load tweet…