థనుష్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ధనుష్ సినిమా దర్శకుడిపై మండిపడుతున్నారు. ఏదో.. తమిళ డైరెక్టర్ మీదనో.. తెలుగు డైరెక్టర్ మీదనో కాదు... ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్టర్ నే తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం తప్పుచేశాడో..? 

తమిళ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందుతున్నాడు ధనుష్. కెరీర్ బిగినింగ్ నుంచి ఎన్నో ప్రయోగాలు చేస్తూ.. స్వతహాగా స్టార్ డమ్ ను సాధించాడు. డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ.. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ.. కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తుంటాడు. నటన పరంకూడా కొత్తదనం చూపిస్తుంటాడు ధనుష్. 

తమిళతో పాటు సౌత్,నార్త్ లోను తన సత్తా నిరూపించుకున్నాడు హీరో. బాలీవుడ్‌లోనూ తనేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు హాలీవుడ్ సైతం ధనుష్ టాలెంట్ ను గుర్తించి అత‌నికి పిలిచి మరీ అవకాశాలిస్తున్నారు. ఇక రీసెంట్ గా ధనుష్ నటించిన హాలీవుడ్ సినిమా ద గ్రే మేన్‌. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా పై ధనుష్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. రూసో బ్ర‌ద‌ర్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ధనుష్ అవిక్ సాన్ అలియాస్‌ ది లోన్ వోల్ఫ్‌ పాత్రలో న‌టించాడు. అయితే.. ఈ సినిమాలో ధ‌నుష్ పాత్ర విషయంలఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు. 

ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ సినిమా చూడాలి అని ఆశతో వెళ్లిన వారికి .. సినిమా మొత్తం మీద ధనుష్ సరిగ్గా కనిపించనే లేదంటూ గొడవ చేశారు. అయితే ఈ విషయంలో స్పందించారు డైరెక్టర్స్. ఫస్ట్ పార్ట్ లో ధనుష్ పాత్రకి అంతే అవ‌కాశం ఉందని,సెకండ్ పార్ట్ మూవీలో ధ‌నుష్‌ క్యారెక్టర్ అదిరిపోతుందని దర్శకులు రూసో బ్రదర్స్ అంటున్నారు. మొదటి భాగంలో ధనుష్‌ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామ‌ని, అందుకు తాము కూడా ఫీలవుతున్నామ‌న్నారు. 

Scroll to load tweet…

ఇక పనిలో పనిగా హీరో గాస్లింగ్‌తో సమానమైన టాలెంట్ ఉన్నన‌టుడు ధ‌నుష్ అని హాలీవుడ్ డైరెక్టర్ కొనియాడారు. రెండో భాగంలో తనకంటూ ఓ బ‌ల‌మైన క‌థ ఉంటుంద‌న్నారు. కచ్చితంగా అందరూ ఆనందపడేలా తన పాత్ర ఉండబోతోందని రూసో బ్రదర్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మాటలతో.. మరో విషయం బయ టకు వచ్చింది. ద గ్రే మేన్‌ సీక్వెల్‌లో కూడాధ‌నుష్ న‌టిస్తున్నాడ‌ని కన్ ఫామ్ చేసినట్టు అయ్యింది. 

ఇక ఈ విషయాన్ని అటు స్టార్ హీరో ధ‌నుష్ కూడా స్ప‌ష్టం చేశాడు. అవిక్ సాన్ అలియాస్‌ ది లోన్ వోల్ఫ్‌గా తన పాత్రను తిరిగి పోషిస్తున్నట్లు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. రాబోయే సీక్వెల్ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ తో కూడిన స్పెషల్ వీడియో క్లిప్ ను ఆయన రిలీజ్ చేశారు.