తమిళ స్టార్ హీరో ధనుష్ దూసుకుపోతున్నాడు. ఇటు తెలుగులో రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తన్న ధనుష్.. తమిళంలో చిన్న సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇక రీసెంట్ గా ధనుష్ న్యూ తమిళ్ మూవీ నుంచి స్టైలీష్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. 

తమిళ స్టార్ హీరో ధనుష్ దూసుకుపోతున్నాడు. ఇటు తెలుగులో రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తన్న ధనుష్.. తమిళంలో చిన్న సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇక రీసెంట్ గా ధనుష్ న్యూ తమిళ్ మూవీ నుంచి స్టైలీష్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. 

ధనుష్ ఏమాత్రం గ్యాప్ లేకుండా గ్యాప్ రాకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. మరీ ముఖ్యంగా  ప్రయోగాత్మకమైన కథలు చేస్తూ.. పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. అలాంటి  అవకాశం వచ్చినప్పుడు మాత్రం,  తన సొంత బ్యానర్లో చేయడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు ధనుష్. ఇప్పుడు ఆయన చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. మరికొన్ని ప్రపోజల్ స్టేజ్ లో ఉన్నాయి. 

ధనుష్ వరుసగా చేస్తున్న సినిమాల్లో  నానే వరువేన్  సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.ఈ విషయాన్ని ధనుశ్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. అంతే కాదు ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ను తన పేజ్ లో షేర్ చేసుకున్నాడు ధనుష్. జీప్ పై చాలా స్టైల్ గా ఆయన ఇచ్చిన పోజు ఆకట్టుకుంటోంది. అంతే కాదు ఈ ఫోటోలో మీసాలు లేకుండా కొత్తగా కనిపిస్తున్నాడు ధనుష్. 

ఈ సినిమాలో మరో విశేషం ఉంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుశ్ హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అంతే కాదు ఈ సినిమా కి ధనుశ్ సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. ఇక ఈమూవీలో ధనుష్ సరసన ఎల్లి అవ్రామ్ .. ఇందుజా  రవిచంద్రన్ హీరోయిన్ గా  అలరించనున్నారు. ప్రభు .. యోగిబాబు లాంటి సీనియర్లు  ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.