ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కుబేర మూవీ
ప్రముఖ నటులు ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర చిత్రం జూన్ 20 న శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. అంటే మరికొన్ని గంటల్లోనే కుబేర ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సోషల్ డ్రామా, ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. విడుదలకు కొన్ని వారాల ముందు నుంచే మంచి బజ్ ఏర్పడింది.
నాగార్జున కామెంట్స్
ఈ సందర్భంగా హీరో నాగార్జున మీడియాతో ముచ్చటిస్తూ, “కుబేర అనేది సామాజికంగా శక్తివంతమైన కథను అందించే అరుదైన సినిమా. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ కథని ఎంతో నమ్మి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో మన సమాజంలో ఉన్న సమస్యలను లోతుగా, సున్నితంగా చూపించారు,” అని అన్నారు.
నాగార్జున ఈ చిత్రంలో ఎంతో ప్రత్యేకమైన పాత్రలో నటించారు. సమాజంలో ఉండే మూడు తరగతుల ప్రజల మధ్య జరిగే సంఘర్షణ ఆధారంగా ఈ చిత్ర కథ ఉంటుందని పేర్కొన్నారు. అంటే ఈ చిత్రంలో ధనుష్, రష్మిక, నాగార్జున ముగ్గురూ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే జిమ్ సార్బ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే వంటి నటులు సహాయ పాత్రల్లో కనిపించనున్నారు.మొత్తం మీద, శేఖర్ కమ్ముల మార్క్ స్క్రీన్‌ప్లే, ధనుష్ నటన, నాగార్జున పాత్ర, రష్మిక అప్పియరెన్స్ ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెడతాయని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.
కుబేర ఫస్ట్ రివ్యూ వైరల్
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ వైరల్ గా మారింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించిన తర్వాత సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. తప్పకుండా ఈ చిత్రం అవార్డు విన్నింగ్ మూవీ అవుతుంది అని అన్నారట.
ఈ చిత్రం 3 గంటల 3 నిమిషాల లాంగ్ రన్ టైంతో ఉండబోతోంది. ఇంత ఎక్కువ రన్ టైం ఉన్నప్పుడు ఆడియన్స్ ద్రుష్టి మరలకుండా ఎంగేజ్ చేయడం దర్శకుడికి కత్తిమీద సామే. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన దర్శకత్వ ప్రతిభతో 3 గంటలకు పైగా ఉన్న ఈ చిత్రాన్ని అద్భుతంగా నడిపించారట. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపించినప్పటికీ క్లైమాక్స్ తో అదరగొట్టినట్లు తెలుస్తోంది.
నాగార్జున, ధనుష్, రష్మిక పాత్రలని కనెక్ట్ చేస్తూ శేఖర్ కమ్ముల నడిపించిన స్క్రీన్ ప్లే చాలా బావుందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సెన్సార్ సభ్యుల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు కలిసి నిర్మించారు. సంగీతాన్ని రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించారు. సినిమా కథ సామాజిక అంశాలపై, కామన్ మ్యాన్ కి దగ్గరగా ఉండటంతో, ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్లపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి.
