తమిళ స్టార్ హీరో ధనుష్ చూడడానికి ఎంతో సింపుల్ గా ఉంటాడు. కానీ వెండితెరపై అతడు చేసే పాత్రలు, వాటికోసం మేకోవర్ అయ్యే తీరు చూస్తే షాకవుతారు. తన స్క్రీన్ ప్రెజన్స్, నటనతో స్టార్ హీరో రేంజికి ఎదిగాడు. అతడు నటించే ప్రతీ సినిమా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. 

కమర్షియల్ సినిమాలలో కూడా కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. గతేడాది 'వడ చెన్నై' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు అదే చిత్రదర్శకుడు వెట్రిమారన్ తో 'అసురన్' అనే సినిమా చేస్తున్నాడు.

వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న నాలుగో సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన గతంలో ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. తాజాగా సెకండ్ లుక్ లాంచ్ చేశారు. మొదట రిలీజ్ చేసిన లుక్ లో ధనుష్ మధ్య వయస్కుడిగా చాలా రఫ్ గా కనిపించారు. తాజా లుక్ లో యువకుడిగా కనిపిస్తున్నాడు. 

ఈ పోస్టర్లను బట్టి ఈ సినిమా పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. సినిమా కోసం ధనుష్ 80ల నాటి కుర్రాడి గెటప్ లోకి మారిపోయాడు.ధనుష్ మేకోవర్ చూస్తోన్న అభిమానులు అతడి డెడికేషన్ చూసి మురిసిపోతున్నారు. ఈ సినిమాలో ధనుష్ మలయాళ నటి మంజు వారియర్ తో జత కట్టనున్నాడు.