కోలీవుడ్ హీరో ధనుష్ మరోసారి తన డిఫరెంట్ గెటప్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ లో రఫ్ లుక్ లో కనిపించడం అందరికి బాగా తెలిసిన ఫార్ములా. అయితే ధనుష్ మాత్రం ఎవరు కనిపించని విధంగా సరికొత్త గెటప్స్ ట్రై చేస్తుంటాడు. 

ఇప్పుడు అసురన్ సినిమాలో కూడా ధనుష్ వైరైటీ లుక్ తో దర్శనమిస్తున్నాడు. రీసెంట్ గా మూడు నెలల కిందట మొదలైన అసురన్  షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ కి చేరుకుంది. అయితే సినిమాకు సంబందించిన లుక్ ని రిలీజ్ చేస్తూ ధనుష్ సినిమా రిలీజ్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు. 

అసురన్ అంటే రాక్షసుడు.. గతంలో కత్తి పట్టుకొని వైల్డ్ క్యారెక్టర్స్ చేసిన అనుభవం ధనుష్ కి ఉంది. దర్శకుడు వెట్రి మారన్ నేషనల్ లెవెల్లో తన సినిమాలు పాపులర్ అయ్యేలా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ కాంబో లో వస్తోన్న కొత్త సినిమా కూడా సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ లుక్ బావుందని సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. వచ్చే నెలలో సినిమా రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.