ఈ ట్రైలర్ లో సిన్సియర్ గా తన వృత్తి ధర్వాన్ని నిర్వర్తించే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కి ఓ పొలిటీషియన్ కి మధ్య వార్ మొదలవుతుంది. ఈ క్రమంలో ధనుష్ ఏం చేశాడు. తనని టార్గెట్ చేసిన పొలిటీషియన్ సముద్రఖనికి ఎలా గుణపాఠం చెప్పాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గత కొంతకాలంగా ధనుష్ చిత్రాలు డైరక్ట్ ఓటీటీల్లో విడుదలవుతున్నాయి . అక్కడా మంచి క్రేజ్ సంపాదించుకుని వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. ధనుష్ నటించిన తాజా చిత్రం `మారన్`. కార్తీక్ నరేఫష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని టి.జి. త్యాగరాజన్ నిర్మించారు. ఇందులో ధనుష్ కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన “మారన్” ఓటీటీలో విడుదలకు సిద్దమయ్యింది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అర్జున్, త్యాగరాజన్‌లు సంయుక్తంగా నిర్మించారు. అయితే తాజాగా “మారన్” తెలుగు ట్రైలర్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలుగు విడుదల చేసింది. మార్చి 11 నుంచి ఈ చిత్రం నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ట్రైలర్ లో సిన్సియర్ గా తన వృత్తి ధర్వాన్ని నిర్వర్తించే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కి ఓ పొలిటీషియన్ కి మధ్య వార్ మొదలవుతుంది. ఈ క్రమంలో ధనుష్ ఏం చేశాడు. తనని టార్గెట్ చేసిన పొలిటీషియన్ సముద్రఖనికి ఎలా గుణపాఠం చెప్పాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళంలో `మారన్` గా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా ధనుష్ చేసే సాహసాలు మాళవిక మోహనన్ - ధనుష్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్లు ఇప్పటికే మూవీపై అంచనాలు పెంచాయి. ఇకపోతే ఈ సినిమాలో ధనుష్ సరసన మాళవికా మోహనన్ నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ జర్నలిస్ట్‌గా కనిపించబోతున్నాడు.
తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కాబోతోంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సమరం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ధనుష్ నిజాలని నిర్భయంగా రాసే పవర్ ఫుల్ జర్నిలిస్టుగా నటించాడు. అతనికి సహాయపడే యువతిగా మాళవికా మోహనన్ కనిపించనుంది.
ఇక ధనుష్ ఈ మూవీతో పాటు ఇంగ్లీష్ లో `ద గ్రే మ్యాన్` తమిళంలో `తిరుచిత్రాంబలం` నానే వరువేన్ వాతీ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో ఇదే ఏడాది ఎంట్రీ ఇస్తున్న ధనుష్ `సార్` పేరుతో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.