కోలీవుడ్ హీరో ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చట్టబద్ధంగా విడిపోయిన ఈ జంట మధ్య మంచి స్నేహం కొనసాగుతున్నట్లు తాజా సంఘటనతో అర్థమైంది. ఒకరినొకరు ట్విట్టర్ లో గ్రీట్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

ధనుష్(Dhanush) భార్య ఐశ్వర్య తో విడిపోయారు. 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పి, విడాకులు తీసుకుంటున్నట్లు ధనుష్ దంపతులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ధనుష్-ఐశ్వర్య విడాకుల ప్రకటన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. రజనీకాంత్ అభిమానులు కూడా ఈ విడాకుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రకటన తర్వాత కూడా వీరి కుటుంబ సభ్యులు రాజీ ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. రజనీకాంత్-ధనుష్ కుటుంబ సభ్యులు హైద్రాబాద్ లో ఓ లగ్జరీ హోటల్ లో పార్టీ చేసుకోగా, ఆ వేడుకలో ధనుష్, ఐశ్వర్య కూడా పాల్గొన్నారు. 

ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య (Aiswarya Rajinikanth)మాట్లాడుకుంటున్నారా? వీరి మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయనే ఓ సందేహం కొనసాగుతుంది. భార్య భర్తలుగా విడిపోయిన ఐశ్వర్య, ధనుష్ మిత్రులుగా మెలుగుతున్నారని తాజా ట్వీట్స్ ద్వారా అర్థవంవుతుంది. ఐశ్వర్య సొంతగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేశారు. ఈ మ్యూజిక్ వీడియోను సక్సెస్ కావాలని ధనుష్ ట్వీట్ చేశారు. సదరు ట్వీట్ లో ఆయన ఐశ్వర్యను ఫ్రెండ్ అంటూ సంబోధించారు. 

Scroll to load tweet…

ధనుష్ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ చేసిన ట్వీట్ కి ఐశ్వర్య స్పందించారు. ఆమె మాజీ భర్తకు ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ లో వేరు సందేహాలు ఎక్స్ చేంజ్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మహేష్ బాబు, అల్లు అర్జున్, మోహన్ లాల్ వంటి స్టార్స్ ఐశ్వర్యకు బెస్ట్ విషెష్ తెలియజేశారు.