హీరో ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ విడిపోతున్నట్టు గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. మళ్లీ కలవబోతున్నట్టు అక్టోబర్‌లో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ విడిపోతున్నారనే వార్త దుమారం రేపుతుంది.

ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ 18ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై చెబుతూ విడిపోతున్నట్టు గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వీరిద్దరు ఓ నోట్‌ని కూడా పంచుకున్నారు. అయితే మళ్లీ కలవబోతున్నట్టు వార్తలొచ్చాయి. డైవర్స్ ని రద్దు చేసుకుని మళ్లీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్టు గత అక్టోబర్‌లో వార్తలొచ్చాయి. రజనీకాంత్‌ .. ఇద్దరి మధ్య రాజీ కుదుర్చారని, దీంతో అంతా సెట్‌ అయ్యిందని అన్నారు. 

కానీ ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు విడిపోవడానికి సిద్ధమయ్యారట. చెన్నైలోని సిటీ సివిల్‌ కోర్ట్ కి ఈ ఇద్దరు విడాకుల కోసం అప్లికేషన్‌ పెట్టుకున్నారట. ధనుష్‌ మరో అమ్మాయి కోసం ఐశ్వర్య రజనీకాంత్‌ తో విడిపోవాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని విమర్శల పాలవుతున్న ఒవర్సీస్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు ట్వీట్‌ చేయడం గమనార్హం. ఆయన ఈ మధ్య బ్రేకింగ్‌ పేరుతో షాకింగ్‌, సంచలన విషయాలను ప్రకటిస్తున్నారు ఉమైర్‌ సంధు. ముఖ్యంగా సినిమా హీరోలు ఎఫైర్లు, గొడవలు టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో ఆయన పోస్ట్ లు హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. 

Scroll to load tweet…

మరి ఇప్పుడు ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌లకు సంబంధించిన వార్త సైతం హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరు మరోసారి విడాకులకు సిద్ధమయ్యారనే వార్త సంచలనంగా మారుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది పెద్ద ప్రశ్న. ఉమైర్‌ సంధు తన పాపులారిటీ కోసం ఇలాంటి కాంట్రవర్సియల్‌ కామెంట్లు చేస్తున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సదరు హీరోహీరోయిన్ల అభిమానులు ఆయన్ని ఏకి పడేస్తున్నారు. బూతులు వాడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ అవేవీ పట్టించుకోకుండా షాకింగ్‌ పోస్టులతో దుమారం రేపుతున్నాడు ఈ ఓవర్సీస్‌ క్రిటిక్స్. మరి ఇందులో నిజమెంతా అనేదానికంటే ఈ పోస్ట్ లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. హాట్‌ టాపిక్ అవుతున్నాయి.