తాజాగా ధనుష్ ఐశ్వర్య లు ఓ పార్టీలో సందడి చేశారు. ఓ కామన్ ఫ్రెండ్ పార్టీకి వీరిద్దరు హాజరయ్యారు. అయితే ఇందులో ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ దూరంగానే ఉన్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush).. భార్య ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth) విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించి అందరికి షాకిచ్చారు. 18ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోతున్నట్టు పంచుకున్న ప్రకటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది నిజమా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే విడిపోవడానికి కారణాలు చెప్పని ఈ జంట తాను కలిసి ఉండలేమని వెల్లడించారు. అయితే వీరిద్దరు విడిపోవడంపై ధనుష్ ఫాదర్ కస్తూరి రాజా త్వరలో కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అభిమానులు సైతం అదే కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా Dhanush ఐశ్వర్య లు ఓ పార్టీలో సందడి చేశారు. ఓ కామన్ ఫ్రెండ్ పార్టీకి వీరిద్దరు హాజరయ్యారు. అయితే ఇందులో ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ దూరంగానే ఉన్నారు. 18ఏళ్లు కలిసి ఉన్న వీరిద్దరు ఆ పార్టీలో ఒకరికొకరు తెలియదన్నట్టుగా వ్యవహరించారట. కనీసం మాట వరుసకి కూడా మాట్లాడుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీరిద్దరు కలిసి మాట్లాడుకుంటారేమో అని అక్కడి గెస్ట్ లంతా ఆసక్తిగా ఎదురుచూశారట. కానీ వీరిద్దరు దూరంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు అంతకు ముందు ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ధనుష్-ఐశ్వర్యలు ఒకే హోటల్‌లో ఉన్నప్పటికీ కనీసం ఒకరినిఒకరు చూసుకొనే లేదట. వీరిని ఇలా చూసిన వారంతా.. మళ్లీ ఈ ఇద్దరు కలిసిపోతారనే ఆశలు వదిలేసుకున్నట్టు సమాచారం.
ఐశ్వర్య రజనీకాంత్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు అనే విషయం తెలిసిందే. 2004లో వీరిద్దరి మ్యారేజ్ జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఐశ్వర్య దర్శకురాలిగా, ప్లే బ్యాక్ సింగర్‌గానూ రాణించారు. ప్రస్తుతం ధనుష్ `మారన్` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈ నెల 11న ఓటీటీలో విడుదల కాబోతుంది. దీంతోపాటు తెలుగు, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి `సర్`. దీనికి వెంకీ అట్లూరి దర్శకుడు. మరోవైపు శేఖర్ కమ్ములతో మరో సినిమా చేస్తున్నారు. వీటితోపాటు `ది గ్రే మ్యాన్` అనే ఇంగ్లీష్ సినిమా, `తిరుచిత్రంబలం`, `నానే వరువేన్` తమిళ చిత్రాలు చేస్తున్నారు ధనుష్.
