కబాలి లో రజినీకాంత్ కూతురిగా నటించిన ధన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదట్లోనే సూపర్ స్టార్ పక్కన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో కూడా అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. రఫ్ లుక్ లో మంచి ఎనర్జీతో పాటు అందంగా కనిపించే ధన్సిక ప్రస్తుతం మంచి ఆఫర్స్ దక్కించుకుంటోంది.

అసలు విషయంలోకి వస్తే..ధన్సికకు ఇటీవల షూటింగ్ లో ఊహించని ప్రమాదానికి గురైంది. తమిళ్ లో యోగి డా అనే సినిమాలో నటిస్తున్న అమ్మడు షూటింగ్ లో భాగంగా ఒక యాక్షన్ ఎపిసోడ్ లో ఇటీవల పాల్గొంది. అయితే రౌడీ లు బీర్ బాటిల్స్ విసురుతున్న సీన్ లో ఉన్న ధన్సిక అనుకోకుండా ప్రమాదానికి గురైంది. పగిలిన గాజు ముక్క ఒకటి ధన్సిక కంటి కింద తగలడంతో ఆమెకు గాయం ఏర్పడింది. 

వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ ప్రధమ చిక్కిత్స అనంతరం ఆమెను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. గాయం పెద్దది కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ముందుగానే అక్కడి మీడియాకు చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. కొంచెం కొలుకోగానే నెక్స్ట్ రోజే షెడ్యూల్ ప్రకారం ధన్సిక యాక్టివ్ గా షూటింగ్ లో పాల్గొంది.  వాలు జడ అనే తెలుగు సినిమాలో కూడా ధన్సిక నటిస్తోంది.