టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ‘ధమాకా’ దుమ్ములేపుతోంది. రోజురోజుకు సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటూ తాజాగా రూ. 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
టాలీవుడ్ సీనియర్ హీరో, మాస్ మహారాజా బ్యాక్ టు బ్యాక్ సినిమాలో ఫ్యాన్స్ ను అలరిస్తూనే విషయం తెలిసిందే. 2022లో వరుస చిత్రాలతో ఎంటర్ టైన్ చేసిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం ‘ధమాకా’తో మాసీవ్ బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 23న ప్రేక్షకుల ముుందుకు వచ్చిన ఈ మాస్ ఎంటర్ టైనర్ తొలిరోజే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. టాక్ అదరడంతో ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ‘ధమాకా’తో సాలిడ్ ఓపెనింగ్స్ ను దక్కించుకుందీ చిత్రం. ఫస్ట్ డే రూ.10 కోట్లు, రెండో రోజూ వరల్డ్ వైడ్ గా రూ.19 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక మూడో రోజు రూ. 33కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆరు రోజుల్లో రూ.56 కోట్లకు చేరుకుంది. పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.89 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి కాస్తా కలెషన్స్ లో స్లో అయినా వసూల్ చేస్తూనే ఉంది.
తాజాగా మాస్ మహారాజా రూ100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రెండు వారాల్లో ‘ధమాకా’ కలెక్షన్లు వందకోట్లకు చేరుకోవడం విశేషం. ఇప్పటికే లాభాల బాటలో పయనిస్తున్న ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మాస్ మహారాజా వింటేజ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రజెన్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్, డాన్స్ తో అభిమానులకు ఫుల్ మీల్స్ అందింది.
తొలిసారిగా మాస్ మహారాజా రవితేజ సరసన శ్రీలీలా జంటగా నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. రవితేజ స్పీడ్ ను శ్రీలీలా క్యాచ్ చేయడంతో థియేటర్ దద్దరిల్లిపోయింది. ఈ యాక్షన్ ఫిల్మ్ కు డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. 2022 డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
