మాస్ మహరాజ్ రవితేజ, కార్తికేయ2తో ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయమైన నిఖిల్ మధ్య ఈ వారం భాక్సాఫీస్ ఫైట్ నడుస్తోంది. రెండు సినిమాలపైనా అంచనాలున్నాయి.  

ఈ శుక్రవారం థియేటర్లలో ధమాకా, 18 పేజెస్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలుపై రిలీజ్ కు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం థియేటర్లలో అవతార్2 మినహా మరే భారీ సినిమా లేకపోవడంతో ఈ రెండు సినిమాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు దక్కటం జరిగిీంది. వింటేజ్ రవితేజ అంటూ ప్రచారం చేయటం, ట్రైలర్ కట్ చేయటంతో ధమాకా చిత్రానికి ఓపినింగ్స్ బాగున్నాయి. అలాగేకార్తికేయ2 సక్సెస్ తర్వాత నిఖిల్ నటించిన సినిమా కావడం ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండటం 18 పేజెస్ సినిమాకు ప్లస్ అయింది. రెండు రాష్టాల్లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగున్నాయి. ఈ నేపధ్యంలో రెండు చిత్రాల ఫస్ట్ డే భాక్సాఫీస్ లెక్కలు చూస్తే...

అందుతున్న సమాచారం మేరకు .. ధమాకా చిత్రం చాలా ఏరియాల్లో అదిరిపోయే ఓపినింగ్స్ వచ్చాయి. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా 670 థియేటర్లలో విడుదల చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ధమాకా థియేటర్ల సంఖ్య 940 కి పైగానే ఉంటుందని తెలుస్తోంది. సిటీల్లో ఫస్ట్ డే, సెకండ్ షో బుక్కింగ్స్ బాగున్నాయి. దాంతో ఈ సినిమాకు వీకెండ్ లో కలెక్షన్స్ కుమ్మేస్తారని నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. 

 బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ గత సినిమాలు నిరాశ పరిచినా మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే మాస్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలగే సత్తా కోల్పోలేదని అర్దమైంది. కమర్షియల్ మాస్ మూవీ చేస్తే కచ్చితంగా జనాలు భారీగానే థియేటర్స్ కి వస్తారని ధమాకా సినిమా నిరూపించింది, అన్ని సెంటర్స్ లో సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ ఓపెనింగ్స్ అయితే బాగున్నాయి అని చెప్పాలి. అయితే సోమవారం నుంచి ఈ సినిమా అసలు కథ తేలనుంది. ధమాకా ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 19 కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ అయ్యి బయిటపడిపోయినట్లే.

ఇక 18 పేజీస్ విషాయనికి వస్తే...ఈ సినిమాకు మల్టిప్లెక్స్ లలో ఆదరణ బాగుంది. సుకుమార్ ఈ సినిమాకు కథ అందించటంతో ఓపినింగ్స్ బాగానే రాబట్టింది. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. కార్తికేయ2 జోడీ అయిన నిఖిల్, అనుపమ ఈ సినిమాలో నటించడం గమనార్హం.ఈ సినిమా కి ఏ సెంటర్స్ లో మాత్రమే ఓపెనింగ్స్ రాగా మాస్ సెంటర్స్ లో బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. మాస్ సెంటర్స్ లో ధమాకా సినిమా డామినేషన్ కనిపించింది. మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి…హైదరాబాద్ మల్టిప్లెక్స్ లలో సందడి కనిపించింది. అయితే పికప్ కావాల్సిన అవసరం ఉంది. వీకెండ్ ఇలా ఉంటే కష్టమే. 

రెండు నెలల క్రితమే రావాల్సిన చిత్రంలో కొన్ని మార్పులు చేసి కాస్త ఆలస్యంగా వచ్చారు. ఇక కార్తికేయ2లో నటించిన అనుపమా పరమేశ్వరనే ఈ చిత్రంలోనూ హీరోయిన్ కావడం ఓ ప్లస్ పాయింట్. ఏదైమైనా మాస్ ప్రేక్షకులు ధమాకాపై, క్లాస్ ప్రేక్షకులు 18 పేజెస్ మూవీపై దృష్టి పెడుతున్నారు. సంక్రాంతి సినిమాలు విడుదలయ్యే వరకు థియేటర్లలో ఈ రెండు సినిమాల హవా కొనసాగుతుందా లేదా.... ఏ సినిమా అప్పటిదాకా నిలబడుతుందో చూడాలి.