Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో వాసుదేవ్ ఇంతకుముందు సైలెంట్ గా ఉండే దానివి కదా తులసి ఇప్పుడు ఆ ధైర్యం ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అనగా అప్పుడు అనసూయ మా అడ్రస్ ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది బాబు అనడంతో తెలుసు అనగా మనసులో లాస్య భజన మొదలు పెట్టారు కదరా బాబోయ్ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వాసుదేవ్ భార్య తులసిని పిల్లల గురించి అడగగా ఇంతలో మధ్యలో లాస్య కలుగజేసుకొని దివ్య డాక్టర్ చదువుతోంది అనగా మరి నీ పిల్లల సంగతి ఏంటి అని అడుగుతాడు వాసుదేవ్. భర్తని విడిచి పెట్టావు పిల్లాడిని హాస్టల్లో చదివిస్తున్నావు నువ్వు మాత్రం టింగు రంగా అని తిరుగుతున్నావు అని అంటాడు. అప్పుడు పనిమనిషి రాములమ్మ ఆడదాన్ని బయట నాలుగు రకాలుగా అంటారు కదా అవన్నీ దిగమింగుకొని కొడుకుని హాస్టల్లో చదివిస్తుంది అని అంటుంది.
అప్పుడు లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు విక్రమ్ దేవుడు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్ళగా అప్పుడు విక్రమ్ దేవుడు చేయి పట్టుకొని అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉండగా అది చూసి రెస్టారెంట్లు అందరు నవ్వుకుంటూ ఉంటారు. నేను మీ ఇద్దరి మధ్యలో ఉంటే అమ్మాయి మాట్లాడలేదు అమ్మాయి రాగానే మీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయండి బాబు అని అనడంతో అంతేనంటావా అని అంటాడు విక్రమ్. కంగ్రాట్యులేషన్స్ అని చెప్పి విక్రమ్ ఒక చోట కూర్చొని చెబుతాడు. ఇంతలో అక్కడికి దివ్య రావడంతో విక్రమ్ సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు దివ్య రావడంతో విక్రమ్ లేచి కూర్చుగా విక్రమ్ లేవడంతో దివ్య కూర్చుంటుంది. అప్పుడు ఇద్దరు కూర్చోవడంతో విక్రమ్ దివ్యవైపు అలాగే చూస్తూ ఉంటాడు.
అప్పుడు దివ్య సారీ చెప్పడంతో పర్లేదు చెప్పండి అని అనగా అదేంటి ఎందుకు అని అడగాలి కదా అందంతో అడగకపోయినా మీరు చెప్తారు కదా అని అంటాడు విక్రమ్. ఆ రోజు అనవసరంగా మీ మీద నేను సీరియస్ అయ్యాను కదా గుర్తుందా అని అంటుంది. మర్చిపోయాను అనడంతో అదేంటి అనగా నవ్వుతున్న మీ ముఖం చూసి ఏదైనా మర్చిపోవచ్చు అని అంటాడు విక్రమ్. మా ఆడపిల్లలు ఎందుకండీ అలా అపార్థం చేసుకుంటారు అనడంతో అది మీ హక్కు అంటూ విక్రమ్ కొంచెం ప్రేమగా మాట్లాడడంతో దివ్య సంతోష పడుతూ ఉంటుంది. ముక్కు ముఖం తెలియని నేను అన్ని మాటలు అన్నాను మీరు ఎందుకు భరించారు అనడంతో అబ్బా ఎందుకంటే దాన్ని గుర్తు చేస్తారు వేరే ఏదైనా మాట్లాడండి అని దివ్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ అలాగే చూస్తూ ఉండగా దివ్య ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది.
ఇంతలోనే అక్కడ ఒకతను బేరర్ ని చదువు లేనివాడు అంటూ నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కోపంతో రగిలిపోతున్న దివ్య అక్కడికి వెళ్లి అతనికి బుద్ధి చెబుతుంది. అప్పుడు దివ్య మాటలకు దేవుడు, విక్రమ్ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు విక్రమ్ దగ్గరికి దివ్య రావడంతో టెన్షన్ పడుతూ ఉండగా సారీ అతని వల్ల నిన్ను డిస్ట్రబ్ చేసినట్టు ఉన్నాను అనడంతో పర్లేదు అని అంటాడు విక్రమ్. అప్పుడు దేవుడు పనిలో పనిగా ఐ లవ్ యు చెప్పేయండి బాబు అని టెన్షన్ పడొద్దు ఉంటాడు.. నేను వెళ్ళొస్తాను అనడంతో అప్పుడేనా అనగా ఏమీ ఇంకా ఏమైనా మాట్లాడాలా అని అంటుంది. మళ్లీ ఎప్పుడు కలుసుకుందాము అనడంతో నేను డాక్టర్ నండీ పదే పదే నన్ను కలవాలని అనుకోకూడదు అనగా మీరు నవ్వుతుంటే ఆకాశంలో నక్షత్రం మెరిసినట్టుందండి అనడంతో దివ్య నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ఇంతలోనే దేవుడు అక్కడికి వచ్చి చిన్నబాబు పనిలో పనిగా చదవండి అని మొగుడికి ఒప్పుకుంటుందో లేదో అడిగేయొచ్చు కదా అనగా ఇప్పుడా అనడంతో మీ వల్ల కాదు కానీ నేనే అడిగేస్తాను అని అక్కడి నుంచి దేవుడు వెళ్లిపోతాడు. మరొకవైపు తులసితో నందు మాట్లాడడానికి దొంగచాటుగా కిచెన్ లోకి వెళ్లి తొంగు చూస్తాడు. అక్కడ తులసి ఒకటే ఉంది అనుకొని లోపలికి వెళ్లి మాట్లాడుదాం అనగా ఇంతలో అక్కడికి రాములమ్మ ఉండడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అది చూసి రాములమ్మ తులసి నవ్వుకుంటూ ఉంటారు. కాస్త ముందు వెనక ఆలోచించాలి కదరా నందు అలా వెళ్ళిపోతే ఎలా అయినా నా బుర్రెంటి సమయానికి పనిచేసే చావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు నందు. రాములమ్మ ఉంటే నేను భయపడాల్సిన అవసరం ఏముంది రాములమ్మని బయటకు వెళ్ళమని చెప్పొచ్చు కదా అనుకుంటూ ఉంటాడు.
తర్వాత మళ్లీ నందు ధైర్యం తెచ్చుకొని లోపలికి వెళ్తాడు. ఏం కావాలి బాబు అనడంతో ప్రైవసీ అనగా అదేం కూర అని అంటుంది. నేను తులసితో ఏకాంతంగా మాట్లాడాలి అనగా అప్పుడు ఓహో అని అక్కడ నిలబడగా ఏంటి ఆలోచిస్తున్నావు అనడంతో ఏకాంతం భార్యాభర్తలకు కానీ మీకు కాదు కదా అనగా తులసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసమ్మ అదేదో బాబు గారు ఏకాంతం కావాలంట నేను బయటకు వెళ్లాలా మీరు మాట్లాడుకుంటారా అని అంటుంది. ఇందాక నువ్వు చెప్పావు కదా అదే నా మాట అనడంతో విన్నారు కదా బాబు అని అంటుంది రాములమ్మ. అప్పుడు నందు స్వారీ తులసి ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర చేయి పట్టుకున్నాను అనగా అది తప్పే కదా బాబు అని అంటుంది రాములమ్మ. అప్పుడు మధ్యలో ప్రతిదానికి రాములమ్మ ఇన్వాల్వ్ కావడంతో నందు ఇరిటేట్ గా ఫీల్ అవుతూ ఉంటాడు.
తర్వాత నందు ఏం చేయాలో తెలియక అక్కడినుంచి వెళ్లిపోవడంతో మీరేం టెన్షన్ పడకండి తెలుసమ్మా ఆయన టెన్షన్ వాళ్లకు చూస్తుంటే ఏదో ఒక రోజు వాసుదేవ్ బాబుకి ఆయనే నిజం చెప్పేలా ఉన్నాడు అనడంతో తులసి ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత దివ్య ఇంటికి వెళ్తుండగా ఇంతలోనే దేవుడు ఆగండమ్మా అని వచ్చి ఇందాక చదువు రాణి వాడు అని ఒక డైలాగ్ చెప్పారు కదా అది సూపర్ గా ఉందమ్మా అని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు మాటలకు దివ్య సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ ఒక చాటుగా ఉండి వారి మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు దేవుడు డైరెక్ట్ గా ఇందాక మాట్లాడినట్టు మీకు ఒకవేళ చదువుకొని వాడు హస్బెండ్ గా వస్తే మీకు ఓకేనా అనడంతో అన్ని విషయాలు ఒకే అయితే చదువు విషయం పెద్దగా పట్టించుకోను అనగా విక్రమ్ సంతోష పడుతూ ఉంటాడు.
సరే నేను వెళ్లొస్తాను అని దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో దేవుడు, విక్రమ్ ఇద్దరు కలిసి విజిల్స్ వేసుకుంటూ స్టెప్పులు వేస్తూ ఉంటారు. మరొకవైపు తులసి ఇంట్లో అందరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు వాసుదేవ్ అంటే ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి నాకు బాగా నచ్చింది అని అంటాడు. ఇదంతా తులసి ఉండటం వల్లే అని వాసుదేవ్ అనడంతో తులసిని పొగడ్డానికి ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది లాస్య. అప్పుడు ఇంకేంటి రా సంగతులు అనడంతో ఎలాగో ఫ్రీగా ఉన్నారు బిజినెస్ గురించి ఒక మాట అనేసుకోండి అని అంటుంది లాస్య. అప్పుడు లాస్య టెన్షన్ పడుతుండగా మా ఇంట్లోనే ఉంటుంది కదరా నేను మాట్లాడుకున్నప్పుడు వినే ఉంటుంది అని ఉంటుంది అంటాడు నందు. మొగుడు వదిలేసాడు కదా ఇంట్లో ఉన్నందుకు స్వేచ్ఛని ఇచ్చాడు కదా అని అన్నిట్లోకి తలదూర్చకు అని అంటాడు వాసుదేవ్. ఇంతలోనే ఇంటికి దివ్య వస్తుంది.
