సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సినిమా ఒకట్రెండు పాటలు తప్ప మిగిలినవి పెద్దగా క్లిక్ అవ్వలేదు.

అవి కూడా సినిమా రిలీజ్ అయిన తరువాత క్లిక్ అయ్యాయి. అయితే మహేష్ బాబు మాత్రం దేవిశ్రీ సంగీతం కారణంగానే సినిమా మరింత బాగా వచ్చిందని నమ్ముతున్నారు. ఈ క్రమంలో అతడిని పొగడ్తల్లో ముంచెత్తాడు. ఇప్పుడు తన తదుపరి సినిమాకు కూడా దేవినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు.

ఈ విషయం మహేష్ అభిమానులను డిస్టర్బ్ చేస్తోంది. 'మహర్షి' సినిమా మ్యూజిక్ ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి దేవికి ఛాన్స్ ఇవ్వడంతో ఆయన అభిమానులు హర్ట్ అవుతున్నారు. మరోపక్క దర్శకుడు అనీల్ రావిపూడి కూడా దేవిశ్రీ వైపే మొగ్గు చూపుతున్నారు.

అనీల్ రూపొందించిన 'ఎఫ్ 2' సినిమాకి దేవి మ్యూజిక్ అందించాడు. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. దీంతో ఇప్పుడు అనీల్ కూడా దేవిశ్రీని రిపీట్ చేయాలనుకుంటున్నాడు.

హీరో, డైరెక్టర్ ఫిక్స్ అయిన తరువాత ఇంకెవరు మాత్రం ఏం చేయగలరు. రేపే ఈ సినిమా లాంఛనంగా మొదలుకాబోతుంది. మహేష్ ఈ ఓపెనింగ్ కి హాజరు కావడం లేదు. ప్రస్తుతం ఆయన హాలిడే ట్రిప్ లో ఉన్నాడు.