ఈ మధ్యకాలంలో దేవిశ్రీప్రసాద్ పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఆయన సినిమాలకు సరైన మ్యూజిక్ అందించలేకపోతున్నాడని, అన్ని ఆల్బమ్స్ నిరాశ పరిచే విధంగా ఉంటున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'వినయ విధేయ రామ' సినిమాలో ఒక్క పాట కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది.

'మహర్షి' సినిమాతో అయినా ఆ లోటు తీరుస్తాడనుకుంటే.. అది కూడా నెరవేరలేదు. తన పాత ట్యూన్స్ నే తిప్పి మళ్లీ వినిపించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకోలేకపోవడంతో దేవిపై మహేష్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో అంత ట్రోలింగ్ జరుగుతున్నా దేవిశ్రీ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.

కానీ తనపై వస్తోన్న విమర్శల గురించి దేవికి తెలియకుండా లేదు. దీంతో ఇప్పుడు సినిమాలకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సినిమాలకు మ్యూజిక్ చేయడంతో తన క్వాలిటీ దెబ్బ తింటుందని గ్రహించిన దేవి ఇకపై చిన్న సినిమాలకు మ్యూజిక్ చేయకూడదని అనుకుంటున్నాడు.

పెద్ద సినిమాల్లో కూడా తనతో ఎక్స్ క్లూజివ్ గా పనిచేసే దర్శకులకు మాత్రమే మ్యూజిక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. ఇందులో భాగంగానే అంతకుముందు చేసుకున్న  ఒప్పందాలు కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తే.. మంచి మ్యూజిక్ అందించే సమయం దొరుకుతుందని భావిస్తున్నాడు.