సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఘనవిజయం సాధించింది. సినిమా సంగతి పక్కన పెడితే ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. దేవిశ్రీ మహర్షి చిత్రానికి చాలా చెత్త ఆల్బమ్ అందించాడని అంతా విమర్శించారు. అయినా కూడా మహేష్ బాబు తన తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరుకి కూడా దేవీశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు.

దీనితో మహేష్ బాబు అభిమానుల్లో ఆందోళన మరింతగా ఎక్కువైంది. ఈ చిత్రానికి ఇంకెత చెత్తగా మ్యూజిక్ ఇస్తాడో.. మహేష్ ఎందుకు దేవీశ్రీని రిపీట్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. మహేష్ అభిమానుల విమర్శల సెగలు దేవీశ్రీని తాకినట్లు ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరూ చిత్ర మ్యూజిక్ గురించి దేవిశ్రీ అభిమానులకు హామీ ఇచ్చాడు. 

మహేష్ బాబు సినిమాలకు కథను ఫాలో అవడం వల్ల ఇంతవరకు మంచి మాస్ బీట్ ఇవ్వలేకపోయాను అని దేవిశ్రీ తెలిపాడు. ఈ చిత్రంలో అదిరిపోయే మాస్ బీట్ అందిస్తా. ఎక్కడ పార్టీ జరిగినా ఆ సాంగ్ తప్పనిసరిగా ఉండాలి అనే విధంగా కంపోజ్ చేస్తా. అలాగే లవ్ సాంగ్ అంటే మొదట ఈ చిత్రంలోని పాటనే వినాలి అనేవిధంగా ఓ ప్రేమ పాటని సిద్ధం చేస్తా అని దేవిశ్రీ మహేష్ అభిమానులకు మాటిచ్చాడు. 

దేవిశ్రీ తన ప్రామిస్ ని ఏమేరకు నిలబెట్టుకుంటాడో వేచిచూడాలి. ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేడి సూపర్ స్టార్ విజయశాంతి చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.