కళ్యాణ్‌ రామ్‌, సంయుక్త మీనన్‌ మరోసారి కలిసి నటిస్తున్న `డెవిల్‌` చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. కళ్యాణ్‌ రామ్‌ నెక్ట్స్ లెవల్‌ షో చేశాడు. ట్రైలర్‌ అంచనాలను పెంచుతుంది.  

కళ్యాణ్‌ రామ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `డెవిల్‌. ఎప్పుడో రిలీజ్‌ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. దర్శకుడుకి సంబంధించిన వివాదంలో ఇరుక్కుంది. కొన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉన్నారు, కానీ ఇప్పుడు సడెన్‌గా ట్రాక్‌లోకి వచ్చింది. ఇటీవల రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ ని విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ బ్రిటీష్‌ ఏజెంట్‌గా నటిస్తున్నారు. 

ఓ మర్డర్‌ కేసు నిమిత్తం ఆయన ఛార్జ్ తీసుకుంటాడు. రాజమహల్‌లో ఓ ప్రముఖ వ్యక్తి హత్య జరుగుతుంది. చేసిందెవరనేది కనిపెట్టాలని బ్రిటీష్‌ దొర నుంచి ఆదేశాలు వస్తాయి. దీంతో కళ్యాణ్‌ రామ్‌ బ్రిటీష్‌ పోలీస్‌ అధికారిగా ఇన్వెస్టిగేషన్‌ చేస్తారు. రాజమహల్‌లో అందరిని ఇన్వెస్టిగేషన్‌ చేస్తాడు. తన తెలివితో అనేక విషయాలు తెలుసుకుంటాడు. ఆ ఇంట్లోనే ఉన్న సంయుక్త మీనన్‌కి పడిపోతాడు. ఈ క్రమంలో ఆయనకు అనేక మిస్టరీ అంశాలు ఎదురవుతుంటాయి. ఇంట్లో అంతా అనుమానంగానే కనిపిస్తుంటారు. అందరూ హంతకులుగానే కనిపిస్తుంటారు. 

మరోవైపు విచిత్రమైన జాతి దాడులు జరుగుతుంటాయి. ఊరిని అల్లకల్లోలం చేస్తుంటారు. ఓ వైపు ఇన్వెస్టిగేషన్‌, ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతాడు. అయితే సీక్రెట్‌ ఏజెంట్‌కి, మర్డర్‌ కేసుకి లింకేంటి అని ప్రశ్నించగా, బ్రిటీష్‌ దొర ప్లాన్‌ బి చెబుతాడు. మరి ఆ ప్లాన్‌ బీ ఏంటి? అసలు కళ్యాణ్‌ రామ్‌ పాత్రలోని రహస్యాలేంటి? ఆయన అసలు ప్లానేంటి? చివరికి ఎలా మారాడు, ఎలాంటి పోరాటం చేశాడనేది సినిమాగా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. 

ట్రైలర్‌ మాత్రం ఆద్యంతం గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. కొన్ని సీన్లు `ఆర్‌ఆర్‌ఆర్‌`ని తలపించారు. యాక్షన్‌ సీన్లు అదిరిపోయాయి. విజువల్ వండర్‌లానూ అనిపించింది. గ్రాండియర్‌ నెస్‌ కళ్యాణ్‌ రామ్‌ సినిమాని మించి ఉందని చెప్పొచ్చు. కళ్యాణ్‌ రామ్‌ తన నెక్ట్స్ లెవల్‌ షో చూపించాడు. ఆద్యంతం ఆసక్తికరంగా ట్రైలర్‌ సాగింది. సినిమాలో మ్యాటర్‌ ఉందనే విషయాన్ని చెబుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో ఈ నెల 29న చూడాలి. ఈ మూవీ ఇయర్‌ ఎండ్‌లో విడుదల కాబోతుంది. 

YouTube video player

`డెవిల్‌` చిత్రానికి మొదట దర్శకుడు వేరే. ఆయన్ని తప్పించి సినిమాని నిర్మించిన అభిషేక్‌ నామానే దర్శకుడిగా టైటిల్‌ కార్డ్ లో వేసుకున్నారు. మరి ఎందుకు తప్పించారు? నిర్మాత దర్శకుడిగా ఎందుకు మారాడు అనేది సస్పెన్స్ ఉంది. ఇందులో `బింబిసార` తర్వాత మరోసారి కళ్యాణ్‌ రామ్‌తో సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మాళవిక నాయర్‌ కీలక పాత్రలో నటిస్తుంది.

Read more: Salaar Cease Fire : ‘సలార్’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రానుంది? సాలిడ్ అప్డేట్.!