రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ కూడా ఒక ఇంటివాడయ్యాడు. గత నెలలో బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఈ సింగర్ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కూడా దేవి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. తన తమ్ముడు డాక్టర్ మౌనికను పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. 

జులై 19న పెళ్లి జరిగినట్లు చెప్పిన దేవి అదే రోజు తన పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీ అని వివరణ ఇచ్చాడు. అయితే తమ్ముడు కరెక్ట్ ఏజ్ లో ఓ ఇంటి వాడవ్వగా రాక్ స్టార్ మాత్రం నాలుగు పదుల వయసుదాటినా ఇంకా బ్యాచురల్ లైఫ్ తోనే కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం నెటిజన్స్ దేవి ట్వీట్ పై వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు     

తమ్ముడిది అయిపొయింది.. మరి అన్నది ఎప్పుడో అంటూ వీలైనంత త్వరగా పెళ్లి చేసుకో బ్రదర్ అని సలహా ఇస్తున్నారు. అయితే గతంలో ఛార్మితో అలాగే మరో హీరోయిన్ తో ప్రేమలు నడిపించినట్లు రాక్ స్టార్ పై రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా టాక్ వచ్చింది. కానీ దేవి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సినీ కెరీర్ లో బిజీ అవుతున్నాడు.