Asianet News Telugu

బాలీవుడ్ ఆఫర్స్..దేవి అదిరిపోయే అప్డేట్

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న ఈ రాక్‌స్టార్.. తాజాగా బాలీవుడ్ సినిమాకు సాంగ్ కంపోజ్ చేయడం విశేషం. ఆ సాంగ్ సూపర్ హిట్టైంది. బాలీవుడ్ లో దేవిని బిజీ చేస్తోంది.
 

Devi Sri Prasad about upcoming Bollywood projects  jsp
Author
Hyderabad, First Published Jun 12, 2021, 9:49 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తమిళ,తెలుగు భాషల్లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరక్టర్ గా ఎదిగిన దేవిశ్రీప్రసాద్ హిందీలోనూ తన సత్తా అప్పుడప్పుడూ చూపిస్తున్నాడు. ఆ మధ్యన సూపర్ హిట్స్ డింకచిక,ఆ అంటే అమలాపురం వంటి పాటలు హిందీలోకి వెళ్లి అక్కడా సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా అక్కడికి వెళ్లిన  'సీటీమార్' కూడా పెద్ద హిట్టైంది. దాంతో అక్కడ హీరోలు,డైరక్టర్స్ దేవి చేత సంగీతం చేయించుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. వరస ప్రాజెక్టులు దేవి ముందుకు వచ్చాయి. వాటిల్లో ఏవి సైన్ చేసారు  అనే విషయమై బాలీవుడ్ మీడియా  ఆయన్ను ప్రశ్నించింది.

దేవి మాట్లాడుతూ ...“ నేను తమిళ,తెలుగు సినిమాలతో పూర్తి బిజీగా ఉన్నాను. గ్యాప్ లేదు. డింకచక తర్వాత నా టీమ్ తో బాలీవుడ్ కు వచ్చాను. ఈ సారి మాత్రం ఇక్కడా దృష్టి పెట్టదలచుకున్నాను. ఖాళీ చేసుకుని పని చేద్దామనుకుంటున్నాను. సీటీమార్ తర్వాత నాకు చాలా హిందీ ఆఫర్స్ వచ్చాయి. అయితే అవేమీ నా అంతట నేను చెప్పలేను. కోవిడ్ తో ఆ ప్రాజెక్టులు ఎప్పుడు ఎనౌన్సమెంట్ అవుతాయో తెలియని పరిస్దితి..ఈ టైమ్ లో నేను మాట్లాడటం తొందరపాటే అవుతుంది.”

“కోవిడ్ తో అంతా గజిబిజి అయ్యిపోయింది. కానీ పాజిటివ్ గా మాట్లాడుకోవాలంటే, ఈ లాక్ డౌన్ నా ప్యూచర్ ప్లాన్స్ ఏమిటని ఆలోచించటానికి టైమ్ ఇచ్చింది. ఇవన్నీ ప్రక్కన పెడితే బాలీవుడ్ లో పనిచేయాలని ఎప్పుడు నుంచో ఎంట్రీ ఇద్దామనుకుంటున్నాను. టైమ్ ని సరిగ్గా షెడ్యూల్ చేసుకుంటూ సౌత్ సినిమాలతో పాటే హిందీ సినిమాలు చేయాలనుకుంటున్నాను ,” అన్నారు.
 
 రికార్డులు కొల్లగొట్టే సంగీతం అందించే సంగీత దర్శకుల్లో టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. క్యాచీ ట్యూన్స్, మాస్ నంబర్స్‌తో ఉర్రూతలూగించే దేవి..ఓ  రేంజిలో క్రేజ్ ఉంది.టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న ఈ రాక్‌స్టార్.. తాజాగా బాలీవుడ్ సినిమాకు సాంగ్ కంపోజ్ చేయడం విశేషం. ఆ సాంగ్ సూపర్ హిట్టైంది. బాలీవుడ్ లో దేవిని బిజీ చేస్తోంది.

సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ పెట్టిన సీటీమార్‌ పాట హిందీ జనాల్ని ఊపేస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘డీజే’ కోసం దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిన పాట ఇది. తెలుగులో పెద్ద హిట్టైన ఈ పాటని మెచ్చి తన ‘రాధే’ చిత్రంతో మరోసారి వినిపించాలని నిర్ణయించారు సల్మాన్‌ఖాన్‌.  అందులో సల్మాన్‌ఖాన్‌ తనదైన శైలిలో స్టెప్పులేశారు. ఈ పాట విడుదల సందర్భంగా సల్మాన్‌... అల్లు అర్జున్‌ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ఇలా మొత్తానికి ఈ సినిమా పాట ఓ రేంజిలో హైప్ తెచ్చుకుంది. 

 దేవిశ్రీప్రసాద్  బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు. దాంతో దేవిని వెతుక్కుంటూ బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా రణ్‌వీర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘సర్కస్‌’ లో రెండు పాటలు చేయటానికి దేవికి ఆఫర్ వచ్చింది. రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్స్. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ లో రణ్‌వీర్‌తో కలిసి దీపిక    ఆడిపాడనుందని సమాచారం. ఈ సాంగ్ కే దేవి సంగీతం ఇస్తున్నాడంటున్నారు.

 షేక్‌ స్పియర్‌ ‘ది కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. రణ్‌వీర్, రోహిత్‌ కలయికలో వచ్చిన ‘సింబా’ మంచి విజయం సాధించింది. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన ‘సూర్యవంశీ’లోనూ రణ్‌వీర్‌ అతిథి పాత్రలో తళుక్కుమన్నాడు. ఈ చిత్రం ఈ  ఏడాది రానుంది. ‘సర్కస్‌’ను త్వరలో  సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ముంబయి, ఊటీ, గోవాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios