బిగ్ బాస్ షో ఆసక్తిగా సాగుతుండగా మూడవవరం హౌస్ నుండి దేవి నాగవల్లి ఎలిమినేటై బయటికి వచ్చారు. గత వారానికి గానూ ఎలిమినేషన్ లో ఉన్న ఏడుగురిలో అతి తక్కువ ఓట్లు పొందిన కారణంగా దేవి ఎలిమినేటైనట్లు నాగార్జున ప్రకటించడం జరిగింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న దేవి నాగవల్లి ఎలిమినేట్ కావడం చాలా మందికి షాక్ ఇచ్చింది. ఎలిమినేషన్ లిస్ట్ లో వున్న వారిలో దేవి నాగవల్లి బాగా తెలిసిన పేస్...అలాంటిది ఆమె ఎలిమినేట్ కావడం అనేక అనుమానాలకు తావిచ్చింది. 

ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక దేవి నాగవల్లి ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా బిగ్ బాస్ హౌస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఎలిమినేట్ కావడం ఆమెకు కూడా షాక్ ఇచ్చిందట. అనేక మంది మేము మీకు ఓట్లు వేశాం ఎలిమినేట్ కావడం ఏమిటని అంటున్నారట.లిస్ట్ లో మెహబూబ్ ఉన్నారు సడన్ గా మార్చేశారని అన్నారట. ఇక హౌస్ లో దేవి నాగవల్లి కూడా కొందరు లైన్ వేశారట. అది ఆమెకు అర్థం అయినదట,నవ్వుకొని వదిలేసింది అట.  అలాగే హౌస్ లో రిలేషన్స్ అడుగగా ఆమె స్పందించారు . 

మూడు నెలలు ఒకే ఇంటిలో ఉన్నప్పుడు రిలేషన్స్ ఏర్పడతాయని, డేటింగ్ లాగా ఫీలవుతున్నారేమో అని దేవి అన్నారు. ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవి ఈ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఆ ఇంటర్వ్యూ కి సంబందించిన ప్రోమో ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తుంది. టీవీ 9 ఛానల్ పై ఉన్న వ్యతిరేకత కారణంగా దేవి నాగవల్లికి ఓట్లు పడలేదని కొందరు అన్నారని ఆమె అనడం విశేషం.