సండే వస్తుందంటే బిగ్ బాస్ నుండో ఒకరు ఎలిమినేట్ కావలసిందే. మూడువారాలు మనతో ఇంటిలో  వెళ్ళిపోతున్నారంటే భావోద్వేగం కలగడం అనేది కామన్. ఈ వారానికి గానూ ఏడుగురు ఎలిమినేషన్ కి ఎంపిక కాగా నిన్న లాస్య, మోనాల్ గజ్జర్ సేవ్ అయ్యారు. నేడు ఒక ప్రక్క ఫన్ గేమ్స్ ఆడిస్తూనే నాగార్జున ఒక్కఒక్కరిగా ఎలిమినేషన్ నుండి సేవ్ చేశారు. వారిలో మెహబూబ్, ఆరియానా, హారికలను నాగార్జున సేవ్ చేశారు. 

ఫైనల్ గా ఇద్దరు కంటెస్టెంట్స్  ఎలిమినేషన్ బరిలో నిలిచారు. కుమార్ సాయి, దేవి నాగవల్లి ఎలిమినేషన్ కి మిగిలారు. రెండు బాక్స్ లు తెప్పించిన నాగార్జున కుమార్ సాయి, దేవి నాగవల్లిని చెరో బాక్స్ లో చేయి ఉంచాలని చెప్పారు. ఒక బాక్స్ లో గ్రీన్ కలర్, ఒక బాక్స్ లో రెడ్ కలర్ ఉన్నాయని, గ్రీన్ కలర్ ఉన్న బాక్స్ లో చేయి ఉంచిన వారు సేవ్ అయినట్లు చెప్పారు. 

ఇక కుమార్ సాయి, దేవి నాగావల్లి ఇద్దరూ బాక్స్ ల నుండి చేయి తీయగా గ్రీన్ కలర్ కలిగిన చేయితో కుమార్  సాయి సేవ్ అయ్యారు. దేవీ నాగవల్లి ఉన్న బాక్స్ లో రెడ్ కలర్ ఉండగా ఆమె ఎలిమినేట్ కావడం జరిగింది. దీనితో ఇంటిలో సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా ఆరియానా గట్టిగా ఏడ్చేసింది.