Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం
ఈరోజు ఎపిసోడ్ లో రిషి స్టేజ్ పైకి వచ్చి వసుధార జగతి వైపు చూస్తూ ఉండగా వాళ్ళిద్దరూ తలదించుకుంటారు. అప్పుడు దేవయాని చెప్పు రిషి వసుధార మెడలో తాళికి నువ్వే కారణం అని జగతి అంటుంది కాదని చెప్పు అని ఉంటుంది. అప్పుడు రిషి మౌనంగా వసుధార వైపు చూస్తూ ఉండగా వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రిషి ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ జగతి మేడం మాట్లాడిన మాటలు నేను విన్నాను. జగతి మేడం చెప్పిన మాటలన్నీ నిజం అని చెప్పడంతో వసుధార, జగతి, దేవయాని అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు వసుధార రిషి వైపు చూసి సంతోషపడుతూ ఉంటుంది.
దేవయాని షాక్ లో ఉంటుంది. రిషి ఏం మాట్లాడుతున్నావు అని దేవయాని అనడంతో అవును పెద్దమ్మ జగతి మేడం చెప్పిన మాటలన్నీ నిజం అని అంటాడు రిషి. ప్రెస్ మీట్ కి వచ్చిన ప్రతి ఒక్క మీడియా రిపోర్టర్స్ కి ధన్యవాదాలు ఈ ప్రెస్ మీట్ లో పర్సనల్ విషయాలకు మాట్లాడకూడదు. ఆ విషయాలు మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు అని అంటాడు రిషి. అప్పుడు దేవయాని అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది. అప్పుడు రిషి ఇది మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వివరించడానికి మాత్రమే పెట్టారు ఇప్పుడు వసుధార గారు వివరిస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.
అప్పుడు దేవయాని వెళ్ళిపోతుండగా రిషి వెనకాలే వెళ్లి ఆగండి పెద్దమ్మ అని అనగా ఇందాకే మీ పెద్దమ్మ చనిపోయింది అనడంతో అలా మాట్లాడకండి పెద్దమ్మ అని అంటాడు రిషి. అసలు నువ్వు ఏం చేశావు రిషి ఏం మాట్లాడావు అంటూ చిన్నప్పటి విషయాలు అన్నీ చెప్పి రిషి ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది దేవయాని. నాకు చెప్పకుండా నా నిర్ణయం తీసుకోకుండా నువ్వు నీ పెళ్లి గురించి నిర్ణయం తీసుకున్నావు అని అంటుంది. నీ భార్యని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత ఈ పెద్దమ్మతో నీకు పని ఏంటి అని అంటుంది దేవయాని. ఇక నీ బాగోగులు అన్నీ వాళ్లే చూసుకుంటారు కదా నీకు ఈ పెద్దమ్మతో పని ఏంటి అంటూ నాటకాలు వాడుతూ రిషి ముందు దొంగ ప్రేమను కురిపిస్తూ ఉంటుంది.
అందరూ కరెక్టే ఈ పెద్దమ్మ ఒక పిచ్చిదాన్ని అంటూ దొంగ నాటకాలు వాడుతూ ఉంటుంది. పెద్దమ్మ ఆగండి నేనేం మారలేదు సమయం వచ్చినప్పుడు జరిగిన విషయాలు అన్ని చెబుతాను అంటున్నాను కదా అని అంటాడు రిషి. అప్పుడు రిషి పెద్ద మమ్మీ కంటే నాకు ఈ లోకంలో ఎక్కువ ఎవరు లేరు మీ తర్వాతే నాకు ఎవరైనా అని అనడంతో దేవయాని నువ్వు లోపల సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు ఫణీంద్ర అక్కడికి రావడంతో ఫ్లేట్ ఫిరాయిస్తూ తెగే దాక లాగితే నేనే ఇబ్బందుల్లో పడతాను అనుకుంటూ సరికొత్త నాటకం మొదలు పెడుతుంది దేవయాని. నీ సంతోషమే నా సంతోషం నువ్వు బాగుంటే చాలు ఈ పెద్దమ్మకు అంతకంటే ఏమి కావాలి అనడంతో రిషి సంతోష పడుతూ ఉంటాడు.
మరొకవైపు వసుధార రిషి క్యాబిన్ లోకి వెళ్తుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది వసుధార. అప్పుడు రిషి సీట్లో కూర్చుంటుంది. అప్పుడు రిషి తాను మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది వసుధార అప్పుడు అక్కడే ఉన్న హార్ట్ చూసి ఓయ్ హార్ట్ మా రిషి సార్ నీ మీద మనసు పడ్డాడు అంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటుంది వసుధార. అప్పుడు వసుధార సంతోషంగా ఎగురుతూ ఉండగా ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. ఏంటి హడావిడి ఎందుకు ఇలా చేస్తున్నావు అనడంతో అదేంటి సార్ మన మధ్య ఉన్న గొడవలకి ఈరోజుతో సమాధానం ఇచ్చారు కదా అని అంటుంది.
ఇప్పుడు రిషి వసుధార ఈ సంతోషంలో ఒక విషయం మర్చిపోయావు నేను నీ భర్తని అని చెప్పాను నువ్వు నా భార్య వని చెప్పలేదు కదా అనడంతో వసుధర షాక్ అవుతుంది. అక్కడ జగతి మేడం మాట్లాడిన మాటలను ఒప్పుకున్నారు కదా సార్ అనడంతో నేను అదే ఉంటున్నాను ఆ మాటలు నేను యాక్సెప్ట్ చేస్తాను అని అంటాడు రిషి. నేను నీకు భర్తనే కానీ నువ్వు నా భార్యవి కాదు అని అనడంతో వసుధార షాక్ అవుతుంది. అలా మాట్లాడుతున్నారు అనడంతో నువ్వు చేసిన పనికి నేను నీ భర్తను అయ్యాను కానీ నువ్వు నా భార్యవి కాలేకపోయావు అంటాడు రిషి. ఒకసారి నేను చెప్పిన మాటల గురించి ఆలోచించి వసుధార అంటూ వసుధారకి పరీక్ష పెడతాడు రిషి.
అదేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే మాటలు ఏంటి నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. నీ అంతటి నువ్వే నీ మెడలో తాళి వేసుకుంటే నేను నీ భర్తను ఎలా అవుతాను చెప్పు అని నిలదీస్తాడు రిషి. అప్పుడు రిషి మాట్లాడే మాటలకు వసుధర ఆలోచనలో పడుతుంది. మన ప్రేమ, మన బంధం పై గౌరవం ఉంది కానీ నువ్వే మన జీవితంలో నేను నీకు తాళి కట్టని భర్తను చేశావు అని అంటాడు రిషి. నాకు తెలియకుండా నా పాత్రని నీకు ఇష్టం వచ్చినట్టు మలుచుకున్నావు అని అంటాడు. రిషి సార్ ఇది కరెక్ట్ కాదు అక్కడ మేడం చెప్పిన మాటలు నిజమైన ఒప్పుకొని మళ్ళీ ఇక్కడ కాదంటున్నారు అని అంటుంది. ఒక విషయం అర్థం అవుతుందా నేను అక్కడే కాదు జగతి మేడం చెప్పిన మాటలను ఇక్కడ కూడా ఒప్పుకుంటున్నాను అని అంటాడు రిషి. మీరు నా భర్త అన్నప్పుడు నేను నీ భార్య నే కదా సార్ అని అంటుంది.
