Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఫోన్ చేయడంతో నువ్వు ఫోన్ చేస్తావా నాకు తెలుసు వసుధార అని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు వసుధార నేను మీకు ఫోన్ చేస్తాను ఎందుకంటే మీరు నా మీద కోపంగా ఉన్నారు. మీ మీద నాకు ప్రేమ ఉంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి కావాలనే ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు వసుధార మళ్ళీ ఫోన్ చేస్తుంది. అప్పుడు రిషి నాకు నిద్ర వస్తుంది మిషన్ ఎడ్యుకేషన్ గురించి పొద్దున మాట్లాడుకుందాం అనగా ఆ విషయం కాదు సార్ అనడంతో ఆ విషయం కాకపోతే ఫోన్ కట్ చేయి ఇంక అవసరం లేదు అంటాడు.
అది కాదు ఎండి గారు అని అంటుంది వసుధార. అప్పుడు ఈ టైంలో ఎండి గారు అనడం అవసరమా అని అంటాడు రిషి. ఆ తర్వాత వసుధార మళ్ళీ ఫోన్ చేసి ఏంటి సార్ సంగతులు అని అంటుంది. అప్పుడు రిషి ఫోన్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. మరుసటి రోజు ఉదయం జగతి మహేంద్ర ఇద్దరు కాలేజీకి వెళ్తారు. అప్పుడు జగతి వసుధార, రిషి గడిపిన ప్రదేశాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది. నాకు ఆ ప్రదేశాన్ని చూస్తే రిషి వాళ్ళు కూర్చున్నట్టు ఉంది మహేంద్ర అనడంతో ఆ ప్రదేశం లోనే కాదు ఈ కాలేజీలో ప్రతి అణువు వాళ్ళు ఉన్నట్లే ఉంటుంది జగతి అంటాడు మహేంద్ర.
అప్పుడు జగతి రిషి మన కంటే ముందుగా బయలుదేరాడు ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ ఉండగా నువ్వేమి టెన్షన్ పడకు ఎక్కడో పని ఉండి ఆగి ఉంటాడులే తల్లి అని ధైర్యం చెబుతాడు మహేంద్ర. ఆ తర్వాత రిషి కార్లో వెళ్తూ ఉండగా అప్పుడు వసుధార వెళ్లి కారుకి అడ్డంగా నిలబడుతుంది. అప్పుడు వెనకాలే కారు రావడంతో రిషి వెళ్లి కారు పక్కకి ఆపుతాడు. అప్పుడు వచ్చి కూర్చొని చెబుతున్నట్టు కార్ డోర్ తీస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత వసుధర కాలేజీకి వెళ్ళగా అప్పుడు రిషి ని మీటింగ్ లో ఏం మాట్లాడాలి సార్ అని అడుగుతుంది.
ప్రాజెక్ట్ హెడ్ నువ్వే కాబట్టి నువ్వే ప్రిపేర్ అవ్వు అని చెబుతాడు రిషి. మరొకవైపు రిషి తన క్యాబిన్లో లవ్ సింబల్ చూసి ఇలా చేసావ్ ఏంటి వసుధార నా గుండెఙ్ నువ్వు ఒంటరి ఒంటరిగా చేశావు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రిషి ఆ లవ్ సింబల్ మీద ఎండి అని రాస్తుండగా వసుధార దొంగ చాటుగా వెళ్లి దాన్ని చూస్తుంది. అప్పుడు రిషి ఏం చూస్తున్నావ్ అనడంతో మీరు ఏం రాశారో నేను చూసాను లెండి సార్ అని అంటుంది. ఎండి అని రాసుకున్నారు ఏంటి సార్ అనగా నేను ఎండీ నే కదా అంటాడు రిషి. కానీ నువ్వు అనుకునే ఎంపీ కాదులే అని అంటాడు రిషి. ఆ ఏంటి అంటే మనిద్దరికీ తెలిసిన ఏమి సార్ అని అంటుంది వసుధార.
అప్పుడు వారిద్దరూ ఎండి గురించి వాదించుకుంటూ ఉండగా ఇంతలా అక్కడికి జగతి,మహేంద్ర వస్తారు. హార్ట్ పైన ఏదో రాశారు అనగా నా ఇష్టం అని అంటాడు రిషి. అప్పుడు వసు కావాలనే మహేంద్ర వాళ్ళందరూ రిషి ని ఆటపట్టిస్తూ ఉంటుంది. అప్పుడు వారందరూ ఎండీ విషయం గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జగతి వసుధార ఇద్దరు అక్కడినుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు దేవయాని జరిగిన విషయాలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి ప్రవర్తనలో మార్పు వచ్చింది అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ ఉంటుంది దేవయాని. వసుధార రిషి ని గుప్పెట్లో పెట్టుకుంది జగతి మహేంద్ర లు ఒకటవుతారు అనుకుంటూ ఉంటుంది.
అప్పుడు వారిద్దరినీ ఎప్పటికీ ఒకటి అవ్వనివ్వను అనుకుంటూ అక్కడ నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత రిషి మీటింగ్ కి వెళ్తాడు. ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. అప్పుడు మీటింగ్ లో రిషి ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి వసుధార గారు కొన్ని విషయాలు చెబుతారు అని అంటాడు.
