టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ చాలా రోజుల తరువాత హాలిడేస్ తీసుకున్నాడు. గత కొన్ని నెలలుగా డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్న విజయ్.. సినిమా పని ఓ కొలిక్కి రాగానే విదేశాలకు ఎగిరిపోయాడు. తన కుటుంబ సభ్యులను కూడా ఈ కుర్ర హీరో వెంటబెట్టుకొని వెళ్ళాడు. 

తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మొన్నటివరకు దొరసాని సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ పనులను ముగించుకున్నాడు. త్వరలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ తో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 

త్వరలో మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. 2020 వరకు విజయ్ మరో సినిమాను ఒకే చేసే పరిస్థితి కనిపించడం లేదు. బిజీ షెడ్యూల్స్ కారణంగా కుటుంబంతో గడపడం కుదరడం లేదని ఇలా విదేశాలకు వారిని తీసుకువచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. దేవరకొండ పేరెంట్స్ తో పాటు నిర్మాత యాష్ రంగినేని ఫ్యామిలీ కూడా ఈ ట్రిప్ కి వెళ్లారు.