`దేవర` చిత్ర టైటిల్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇది తన టైటిల్ అని, చెప్పకుండా కొట్టేశారని ఆరోపించారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ వచ్చింది. ఆయన కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న `ఎన్టీఆర్30` చిత్రానికి `దేవర` అనే టైటిల్ ని ఖరారు చేశారు. రేపు(మే 20) ఎన్టీఆర్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని నేడు(శుక్రవారం) ఈ చిత్ర టైటిల్‌తోపాటు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నల్లని దుస్తులు ధరించి చేతిలో ఆయుధం పట్టుకుని సముద్రంలో రాళ్లపై నిల్చొని కోపంగా చూస్తున్న తారక్ ఫస్ట్ లుక్ గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. ఈ సినిమా మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుందని ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇది సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
`దేవర` చిత్ర టైటిల్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇది తన టైటిల్ అని, చెప్పకుండా కొట్టేశారని ఆరోపించారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. `దేవర` నేను రిజిస్టర్ చేసుకున్న నా టైటిల్. నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్‌ని కొట్టేశారు` అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్. అయితే ఈ టైటిల్‌ని బండ్ల గణేష్ రిన్యూవల్ చేసుకోవడం మర్చిపోయారట. దీంతో ఆ టైటిల్‌ని కొరటాల తీసుకున్నట్టు తెలుస్తుంది.
బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వివాదంగానూ మారుతుంది. దీంతో స్పందించి మరో ట్వీట్‌లో క్లారిటీ ఇచ్చాడు. తాను పెట్టిన పోస్ట్ కి ఆయన రిప్లై ఇస్తూ, `నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నా దేవరే` అంటూ కూల్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ విషయం కాసేపు హీటెక్కి కూల్ అయ్యింది. బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్‌ని దేవర అంటూ పిలుస్తుంటారు. మార్నింగ్ లేవడంతోనే `దేవర` అంటూ ట్వీట్లు పెట్టేవారు. పవన్‌తో సినిమా చేసేందుకు ఆయన చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. కానీ సెట్ కావడం లేదు.
దీనికితోడు కొన్ని రోజులుగా పవన్‌తో బండ్ల గణేష్‌కి కాస్త గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. పవన్‌పై కొంత నెగటివ్ కామెంట్లు కూడా బండ్ల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు `దేవర`అనే టైటిల్‌ని ఎన్టీఆర్ సినిమాకి తీసుకోవడం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న `దేవర` చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని
వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.
