`దేవర` మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ.. ఎంతొచ్చింది? నిజమెంతా?

ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అయితే, ప్రకటించిన కలెక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

devara movie first day collections really shock arj

ప్రస్తుతం థియేటర్లలో `దేవర` సినిమా హంగామా నడుస్తుంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ నటించిన సోలో మూవీ కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పైగా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన మూవీ కావడంతో, ఎన్టీఆర్‌ మార్క్ యాక్షన్‌ ఉండటంతో సినిమా భారీ హైప్‌తో థియేటర్లోకి వచ్చింది. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయడం, బాలీవుడ్‌ నుంచి జాన్వీ కపూర్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేయడం సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. దీనికితోడు విలన్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌ని తీసుకోవడం మరో విశేషం. దీంతో సినిమా రేంజ్‌ అమాంతం పెరిగింది. పైగా దర్శకుడు కొరటాల మొదట్నుంచి సినిమాకి భారీ హైప్‌ ఇచ్చారు. భయం అంటే తెలియని మనుషులకు భయాన్ని హీరో ఎలా పరిచయం చేశాడనేది కథ అని చెప్పడంతో క్యూరియాసిటీ క్రియేట్‌ అయ్యింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

`దేవర` భారీ అంచనాలతో రిలీజ్‌..

ఇక భారీ అంచనాలతో `దేవర` సినిమా శుక్రవారం (సెప్టెంబర్‌ 27న) ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీతోపాటు ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో విడుదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ ఈ మూవీ దుమ్మురేపింది. ఓవర్సీస్‌లో నాన్‌ ప్రభాస్‌ రికార్డులు బ్రేక్‌ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ సాధారణ ఆడియెన్స్ మాత్రం యావరేజ్‌గా ప్రకటించారు. దీంతో ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం ఉంటుందేమో అనుకున్నారు. 

devara movie first day collections really shock arj

`దేవర` బాక్సాఫీసు వద్ద సునామీ..

కానీ తాజా లెక్కలు చూస్తుంటే అలాంటి ప్రభావం లేదని తెలుస్తుంది. తాజాగా టీమ్‌ అధికారికంగా `దేవర` సినిమా కలెక్షన్లని ప్రకటించింది. ఊహించని కలెక్షన్లు ఈ మూవీకి రావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి ఏకంగా రూ.172కోట్లు వచ్చిందని టీమ్‌ వెల్లడించింది. ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో `దేవర` చేరిపోయిందని చెప్పొచ్చు. `బాహుబలి 2`, `ఆర్‌ఆర్‌ఆర్‌, `సలార్‌`, `కేజీఎఫ్‌`, `కల్కి` వంటి చిత్రాల తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచినట్టుగా తెలుస్తుంది. తెలుగు వర్షన్‌ ఈ మూవీ 80కోట్లకుపైగా షేర్‌ సాధించిందని, ఓవర్సీస్‌లో యాభై కోట్ల వరకు వచ్చి ఉంటుందని టాక్‌.  

`దేవర` కలెక్షన్లలో నిజమెంతా..

ఇదిలా ఉంటే ఈ కలెక్షన్ల విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది నిజం కాదనే టాక్‌ వినిపిస్తుంది. ఎక్కువ వేసి చెప్పారని, జీఎస్‌టీ, టాక్స్ లు వంటివి తీయకుండా వేశారనే టాక్ వినిపిస్తుంది. నిజానికి ఈ మూవీ సుమారు 150కోట్ల వరకు గ్రాస్‌ కలెక్ట్ చేసిందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ని రాబట్టిందని, ఆ తర్వాత ఓవర్సీస్‌లో దుమ్మురేపిందంటున్నారు. కానీ మిగిలిన ఏరియాల్లో కలెక్షన్లు డల్‌గా ఉన్నాయని అంటున్నారు. ఎన్టీఆర్‌కి తమిళం, కన్నడ, మలయాళంలో పెద్దగా మార్కెట్‌ లేదు. హిందీలో `ఆర్‌ఆర్‌ఆర్` ప్రభావం కొంత ఉంది. కానీ చెప్పుకోదగ్గది కాదని చెప్పొచ్చు. అయితే `దేవర` చిత్రంతోనే ఆయన పుంజుకోవాల్సి ఉంది. మరి ఈ మూవీ ఏమేరకు సత్తా చాటుతుందనేది వీకెండ్‌ దాటితే గానీ చెప్పలేం. ఎంత ఫేక్‌, ఎంత నిజం అనేది పక్కన పెడితే భారీ స్థాయిలోనే కలెక్షన్లు వచ్చి ఉంటాయని చెప్పొచ్చు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రాల్లో `దేవర`నిలుస్తుంది. అదే సమయంలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన ఇండియన్‌ సినిమాల జాబితాలోనూ చేరిపోతుంది. 

devara movie first day collections really shock arj

`దేవర` కాస్ట్ అండ్‌ క్రూ..

`దేవర` సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయగా, కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటించారు. గెటప్‌ శ్రీను, ప్రకాష్‌ రాజ్‌, అజయ్‌ కీలక పాత్రల్లో మెరిశారు. కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని, హరికృష్ణ నిర్మించారు. సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో ఈమూవీని తెరకెక్కించారు. దీనికి అనిరుథ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వర్క్ చేయడం విశేషం. వీరితోపాటు టాప్‌ టెక్నీషియన్లు ఈ మూవీకి పనిచేశారు. 

`దేవర` కథేంటంటే?

తమిళనాడు, ఆంధ్ర బార్డర్‌లో ఉన్న కోస్టల్‌ ఏరియాలో నాలుగు ఊర్లు ఉంటాయి. వాటిని కలిపి ఎర్రసముద్రం అంటారు. వారంతా ఆయుధాలను పూజిస్తుంటారు. వాటిని ఇష్టధైవంగా భావిస్తుంటారు. సముద్రం మీదుగా వెళ్లే షిప్‌ల్లో సరుకురి తెస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆ సరుకు తెచ్చిస్తే భారీగా డబ్బులు ఇస్తుంటాడు మురుగా అనే స్మగ్లర్‌. తాము చేస్తున్న తప్పు అని కోస్ట్ గార్డ్ సెక్యూరిటీ ద్వారా తెలుసుకున్న దేవర, ఈ పని ఆపేయాలనుకుంటాడు. భైరతోపాటు ఇతర నాయకులు దాన్ని తిరస్కరించి షిపుల్లో సరుకు తెచ్చేందుకు వెళతారు. వారిని దేవర అడ్డుకుంటాడు. ఈ క్రమంలో దేవరని చంపేయాలని ప్లాన్‌ చేస్తారు. కానీ దేవర తమ అనుచరులను చంపేసి మాయమవుతాడు. సముద్రంలో ఉంటూ తప్పుడు పనికి సముద్రంలోకి వచ్చే వారిని అంతం చేస్తుంటారు. దేవర కొడుకు వర ఉట్టి పిరికి. దేవరలాంటి ధైర్యం లేదు. చిన్న చిన్న వాటికి భయపడుతుంటాడు. భైర(సైఫ్‌ అలీ ఖాన్‌) వల్ల వర ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, నిజంగా దేవర ఏమైయ్యాడు? చివరగా చోటు చేసుకున్న ట్విస్ట్ ఏంటనేది సినిమా కథ.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios