Asianet News TeluguAsianet News Telugu

దేవదాస్ ట్విట్టర్ రివ్యూ!

ఎప్పుడు లేని విధంగా ఈ ఇద్దరి హీరోలపై అంతరి ద్రుష్టి కాస్త ఎక్కువగా పడింది. యువదర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించడంతో సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో రివ్యూలు ఇవ్వడం మొదలెట్టేశారు.

devadas twitter review
Author
Hyderabad, First Published Sep 27, 2018, 10:48 AM IST

నాగార్జున - నాని మొదటి సారి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం దేవ దాస్. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఇద్దరి హీరోలపై అంతరి ద్రుష్టి కాస్త ఎక్కువగా పడింది. యువదర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించడంతో సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో రివ్యూలు ఇవ్వడం మొదలెట్టేశారు. ట్విట్టర్ ద్వారా వెలువడిన టాక్ ఎలా ఉందొ చూద్దాం. 

నాని - నాగార్జునలకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ అందరికి తెలిసిందే. దీంతో వారి అభిమానులు ఎన్నో అంచనాలతో సినిమాకు వెళ్లారు. కానీ సినిమా మాత్రం అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయిందని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సన్నివేశాలు నాగ్ పర్ఫామెన్స్ నాని ఇన్నోసెంట్ ఫన్ ఆడియెన్స్ బాగా నచ్చాయట. కానీ కథలో పట్టు లేదని టాక్ వస్తోంది. కథనంతో ఆడియెన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకున్న శ్రీరామ్ ఆదిత్య  పూర్తిగా మెప్పించలేకెపాయాడు. 

ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై కాస్త ఆసక్తిని పెంచినప్పటికీ సెకండ్ హాఫ్ లో ఫ్లో మిస్ అయ్యింది. డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి సినిమా ఎంతవరకు నచ్చుతుందో చెప్పడం కష్టమే. కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన ఆడియెన్స్ ని సినిమా కొంత వరకు ఆకట్టుకోవచ్చని సోషల్ మీడియా ద్వారా వెలువడిన టాక్ లో అర్ధమవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios