మల్టీస్టారర్ కథలంటే ఎవ్వరైనా ఇష్టపడతారు., ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఆ కిక్కే వేరు. కానీ కొన్నిసార్లు అంచనాలు పెరిగినప్పుడు సినిమా ఆకట్టుకొకకపోతే దెబ్బ పడుతుందని రుజువయ్యింది. నాగార్జున - నాని నటించిన దేవదాస్ చిత్రం ఫైనల్ గా కలెక్షన్స్ ప్రకారం ప్లాప్ అని తేలిపోయింది. 

రీసెంట్ గా వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే సినిమా మొత్తంగా 26.23కోట్ల షేర్స్ ను మాత్రమే అందుకుంది. నాగార్హున గత సినిమాలు మూడు కూడా డిజాస్టర్ అవ్వడంతో పాటు నాని కృష్ణార్జున యుద్ధంతో ప్లాప్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు నటించిన దేవ దాస్ సినిమా కూడా అదే జాబితాలో చేరిపోయింది. 

దేవదాస్' థియేట్రికల్ రైట్స్ వాల్యూ 36కోట్లు. సినిమాకు వచ్చిన షేర్స్ 26.23 కోట్లు. అంటే ఇంకా 10కోట్లు వచ్చి ఉండే బయ్యర్స్ అయ్యుండేవారు. 70%మాత్రమే రికవర్ చేయగలిగింది. ఇక కొన్ని చోట్ల నిర్మాత సొంతంగా కూడా రిలీజ్ చేసుకున్నారు. మొత్తంగా నాని - నాగార్జునలకు మరోసారి ఊహించని దెబ్బ తగిలిందనే చెప్పాలి. 

ఏరియాల వారీగా దేవ దాస్ అందుకున్న షేర్స్:

నైజాం - 7.12 కోట్లు   

సీడెడ్ - 2.83 కోట్లు  

ఉత్తరాంధ్ర - 2.70 కోట్లు 

ఈస్ట్ - 1.37 కోట్లు 

వెస్ట్ - 1.09 కోట్లు

కృష్ణ - 1.60 కోట్లు 

గుంటూరు - 1.71 కోట్లు  

నెల్లూరు - 0.78 కోట్లు   

ఏపీ + తెలంగాణా - రూ. 19.20కోట్లు   

రెస్ట్ ఆఫ్ ఇండియా - 2.80 కోట్లు   

ఓవర్సీస్ - 3.72 కోట్లు   

ప్రపంచం వ్యాప్తంగా వచ్చిన టోటల్ షేర్స్ - రూ.26.23 cr