గత వారం రిలీజైన దేవదాస్ పరవాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది. నాగార్జున - నాని దేవ దాస్ లుగా వెండి తెరపై మంచి కామెడీని ఎమోషన్ ని పండించారు. మల్టీస్టారర్ లో ఇద్దరు సమానమైన క్రెడిట్ ను అందుకున్నారు. అయితే నాని చేసిన పాత్ర కొంచెం ఎక్కువ నవ్వించిందని చెప్పవచ్చు.
శుక్రవారం వచ్చింది అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి టెన్షన్ మొదలవుతుంది. ఒకరేమో కలెక్షన్స్ బాగా రావాలని కోరుకుంటే మరొకరేమో ఆ సినిమా కలెక్షన్స్ తమ సినిమాపై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అని ఆలోచిస్తుంటారు. డైరెక్ట్ గా పాయింట్ కు వస్తే గత వారం రిలీజైన దేవదాస్ పరవాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది.
నాగార్జున - నాని దేవ దాస్ లుగా వెండి తెరపై మంచి కామెడీని ఎమోషన్ ని పండించారు. మల్టీస్టారర్ లో ఇద్దరు సమానమైన క్రెడిట్ ను అందుకున్నారు. అయితే నాని చేసిన పాత్ర కొంచెం ఎక్కువ నవ్వించిందని చెప్పవచ్చు. నాగ్ డాన్ గా కనిపించిన తీరు కూడా ఆకట్టుకుంది. అయితే సినిమా కెలెక్షన్స్ పరంగా చుస్తే ఓపెనింగ్స్ బాగానే అందినప్పటికీ. రోజులు గడుస్తున్నా కొద్దీ తగ్గుముఖం పట్టడం బయ్యర్లకు కొంత ఆందోళన కలిగించింది.
అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం సినిమా 40 కోట్ల గ్రాస్ ను అందుకొని సేఫ్ జోన్ కు దగ్గరగా ఉన్నట్లు చెప్పవచ్చు. ఇంకో వారం ఇలానే కొనసాగితే సినిమా బయ్యర్స్ ఫుల్ హ్యాపీ కావచ్చు. దేవదాసుకి ఈ వారం విడుదలైన సినిమాలు పెద్దగా పోటీని ఇవ్వలేవని కథనాలు వెలువడుతున్నాయి. మరి సినిమా షేర్స్ పరంగా ఎంత లాభాలను అందుకుంటాయో చూడాలి.
