కార్తీ - రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం  దేవ్ గత వారం రిలీజైన సంగతి తెలిసిందే. హిట్టవుతుంది అనుకున్న ఈ సినిమా ఊహించని విధంగా కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా సినిమా నిర్మాతలను దారుణంగా ముంచేసింది. అయితే అత్యాశకు పోయి నాలుగు కోట్ల అఫర్ ని దేవ్ నిర్మాతలు చేజార్చుకున్నారు. 

దేవ్ సినిమా రిలీజ్ కు ముందు ట్రైలర్ అండ్ పోస్టర్స్ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే సినిమా శాటిలైట్ రైట్ హక్కులను దక్కించుకోవడానికి కొన్ని బడా ఛానెల్స్ 3 నుంచి 4 కోట్ల వరకు అఫర్ చేశాయి. అయితే అందుకు ఒప్పుకొని చిత్ర యూనిట్ సినిమాపై నమ్మకంతో ఇంకాస్త ఆశపడి ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేసిందట. 

ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో చెప్పిన దేవ్ నిర్మాతలు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రిలీజ్ అనంతరం ఫ్లాప్ టాక్ రావడంతో ధర 50 లక్షలకు పడిపోయింది.  అయినా కూడా ఏ ఛానెల్ వారు సినిమాను తీసుకోవడం లేదని సమాచారం. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ను లక్ష్మణ్ రవిశంకర్ నిర్మించారు.