కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. నయనతార కథానాయకిగా నటిస్తోంది. బిగ్ బి అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ట్రైలర్ లో విజువల్స్, ఎమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సైరా ప్రీరిలీజ్ బిజినెస్ ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 109కోట్లకు అమ్ముడయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా ఓవర్సీస్ డీల్ కూడా కుదిరింది. 

అన్ని భాషలలో ఓవర్సీస్ హక్కులు 35 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇది భారీ మొత్తమే అని చెప్పొచ్చు. సైరా చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. దాదాపు 250 కోట్లకు పైగా బడ్జెట్ తో సైరా చిత్రాన్ని నిర్మించారు. కేవలం విఎఫెక్స్ కు మాత్రమే 45 కోట్లు ఖర్చయ్యాయి. స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పనితనం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ కాబోతున్నట్లు తెలుస్తోంది.