వేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్‌ రాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్‌ రాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. అయితే ఆంధ్రా, తెలంగాణాలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపధ్యంలో ఈ సినిమా ఫోస్ట్ ఫోన్ చేస్తారనే టాక్ మొదలైంది. అయితే నిర్మాతలకు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని తెలుస్తోంది. అలాగే భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. 

వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చిన దగ్గరనుంచీ పవన్ మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైపోయింది. ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటేనే అర్ధం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో. అందులోనూ పవన్ కళ్యాణ్‌ మూడు సంవత్సరాల తర్వాత వకీల్‌ సాబ్‌ సినిమా తో రాబోతున్నారు. ఏప్రియల్ 9 న సినిమా రిలీజ్ కాబోతోంది. రాజకీయాల్లోకి వెళ్లి పోయిన పవన్‌ మళ్లీ సినిమాలు చేయడని చాలా మంది అనుకున్నారు.

 కాని ఊహించని విధంగా పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్‌ అభిమానులు రీ ఎంట్రీని భారీ ఎత్తున సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా..ఎప్పుడు బెనిఫిట్ షోలకు వెళ్దామా అన్న ఉత్సాహంలో ప్యాన్స్ ఉన్నారు. ఈ నేపధ్యంలో వకీల్ సాబ్ చిత్రానికి బెనిఫిట్ షో కు ఫర్మిషన్స్ దొరుకుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది. 

దర్శకుడు మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్‌ను దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందడం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఒక కథను ప్రేక్షకులకు నచ్చేలా చెప్పడం చాలా సవాలుతో కూడుకున్న పని. అందులోనూ పవన్ కళ్యాణ్‌ స్టార్‌ డమ్‌కి తగ్గట్టు, ఆయనకున్న విపరీతమైన ఫాలోయింగ్‌ని దృష్టలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని కమర్షియల్‌ అంశాలను జోడించినట్లు తెలిపారు. 

 ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘పవన్‌ కల్యాణ్‌ను బిగ్‌ స్క్రీన్‌ పై చూసేందుకు మనం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాం. వెయిటింగ్‌ పూర్తయింది. ట్రైలర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మాత్రమే. ఏప్రిల్‌ 9న లంచ్, డిన్నర్‌ కలిసి చేద్దాం’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ కంటే సినిమా ఇంకా బాగుంటుంది’’ అన్నారు వేణు శ్రీరామ్‌. హిందీ హిట్‌ ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘వకీల్‌ సాబ్‌’ రూపొందిన విషయం తెలిసిందే.