ఢిల్లీ హైకోర్టులో ఐశ్వర్య రాయ్ కూతురు పిటిషన్.. 9 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేదం..

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనువరాలు, అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూతురు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా కోర్టు తీర్పును వెలువరించింది. 
 

Delhi HC Restrains Youtube Channel from Publishing fake Content on Aaradhya Bachchan Health NSK

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనువరాలు, అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) గారాల కూతురు ఆరాధ్య బచ్చన్ పై కొన్ని యూట్యూబ్ చానెళ్లు తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. దీంతో ఆరాధ్య బచ్చన్ తను న్యాయం చేయాలని, తనపై జరుగుతున్న ట్రోలింగ్ నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆరాధ్య బచ్చన్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా కోర్టు స్పందించింది. 

ఆరాధ్య ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రసారం చేశారంటూ యూట్యూబ్ ఛానళ్లపై కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై కల్పిత వార్తలు రాసి, వీడియోలు చేసిన రూపొందించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తాజా  ఢిల్లీ హై కోర్టు ఘాటుగా స్పందించింది. ఆరాధ్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను  యూట్యూబ్ ఛానెల్‌లు ప్రసారం చేయడాన్ని నిరోధించాలని కోరుతూ ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ ద్వారా ఆరాధ్య బచ్చన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తాజాగా విచారించింది. 

ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై తప్పుడు కంటెంట్‌ను వ్యాప్తి చేసిన 9 యూట్యూబ్ ఛానెల్‌లను హైకోర్టు పూర్తిగా నిషేధించింది. 'ప్రతి బిడ్డకు గౌరవంగా జీవించే హక్కు, తమ పట్ల గౌరవంతో వ్యవహరించే హక్కు కలిగి ఉన్నారు.’ అని పేర్కొంది. ఈ మేరకు  సి హరిశంకర్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది. ఆరాధ్య ఇచ్చిన దరఖాస్తులోని 25-26 పేరాలో నమోదు చేయబడిన URLలకు సంబంధించిన వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.

జస్టిస్ శంకర్, పిటిషన్‌లో అందించిన చిత్రాలు, వీడియో క్లిప్‌లను పరిశీలించిన తర్వాత బలమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. సెలబ్రిటీలకు సంబంధించి ఇటువంటి తప్పుదోవ పట్టించే సమాచారం ప్రసారం కావడం ఇది మొదటిసారి కాదు. అయినప్పటికీ స్టార్ కిడ్స్ పై ఆరోపించిన సమాచారం కావడంతో వారి భవిష్యత్ ను ఉద్దేశించి ఇలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘సెలెబ్రిటీ లేదా సామాన్యుడి బిడ్డ అయినా.. ప్రతి బిడ్డను గౌరవంగా చూసుకోవాలి.’ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టంలో పూర్తిగా సహించలేనిది అని వ్యాఖ్యానించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios