రష్మిక డీప్ ఫేక్ వీడియో డిటేల్స్..దొరికాయి కానీ..
ఇప్పుడు బాలీవుడ్ నటి కాజోల్‌పై మరో వీడియో రూపొందించడం చర్చనీయాంశంగా మారింది.

రష్మిక డీప్ ఫేక్ వీడియో ఆన్‌లైన్‌లో మహిళల సెక్యూరిటీపై ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. బిగ్‌బీ అమితాబ్ సహా అనేకమంది నటీ నటులు, ఇతర సెలబ్రిటీలు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చివరికి కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించి మరోసారి సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని గుర్తు చేసింది. ఈ నేపధ్ాయంలో ఈ వీడియో ఘటనలో కీలక పరిణామంచోట చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు బిహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఆ యువకుడిని ప్రశ్నించినట్టు అధికారులు వెల్లడించారు.
ఇక రష్మిక డీప్ ఫేక్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో తొలుత షేర్ చేసిన సదరు యువకుడు.. ఆపై ఇతర ఫ్లాట్ ఫాంలపై షేర్ చేశాడని చెప్పారు. అయితే, రష్మిక వీడియోను తాను ఇన్ స్టా నుంచి డౌన్ లోడ్ చేసినట్లు ఆ యువకుడు చెప్పాడని వివరించారు. తాను మార్పింగ్ చేయలేదని, ఇన్ స్టాలో ఉన్న వీడియోను డౌన్ లోడ్ చేసుకుని షేర్ చేశానని చెప్పాడన్నారు. అయితే ఈ కేసు దర్యాఫ్తులో వేగం పెంచామని చెప్పిన పోలీసులు.. ఇప్పటి వరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
FIR నమోదు చేసిన వెంటనే, IFSO యూనిట్ కూడా నిందితుడిని గుర్తించడానికి URL ఇతర వివరాల కోసం సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు లేఖ రాసింది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనలో నవంబర్ 10న, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO)లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 465 (ఫోర్జరీకి శిక్ష) , 469 (పరువుకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C , 66E కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ యూనిట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వేరే ఇన్‌స్టా ఖాతానుంచి ఆ వీడియోను తాను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు యువకుడు చెప్పినప్పటికీ, విచారణ కొనసాగుతుందని సంబంధిత సీనియర్ అధికారులు తెలిపారు.
వీడియోను మరువకముందే పలువురు ఆకతాయిలు ఇప్పుడు బాలీవుడ్ నటి కాజోల్‌పై మరో వీడియో రూపొందించడం చర్చనీయాంశంగా మారింది. ‘కాజోల్ డ్రెస్ ఛేంజింగ్ వీడియో’ అంటూ దీనిని నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ’గెట్ రెడీ విత్ మీ’ అంటూ ఓ సోషల్ మీడియా నటి పోస్ట్ చేసిన వీడియోకు కాజోల్ ముఖాన్ని ఉపయోగించి ఈ ఫేక్ వీడియో సృష్టించారు. దీనిపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ వీడియోలతో సినీ తారలను టార్గెట్ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో టిక్‌టాక్ వేదికగా ఓ సోషల్ మీడియా స్టార్ దీనిని పోస్ట్ చేశారని, దానిని ఉపయోగించి కాజోల్ ఇమేజ్‌కి ఇబ్బంది కలిగించేలా ఈ వీడియో చేశారని మండిపడుతున్నారు.