రజినీకాంత్ ను 100 కోట్లు ఇవ్వమని డిమాండ్!

First Published 4, Jun 2018, 12:00 PM IST
Defamation case filed against Rajinikanth and Kaala film
Highlights

రజినీకాంత్ దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్ లో రూపొందిన నూతన చిత్రం 'కాలా'. జూన్ 7న 

రజినీకాంత్ దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్ లో రూపొందిన నూతన చిత్రం 'కాలా'. జూన్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబైలో  ధారవి ప్రాంతలో ఉండే తమిళుల కోసం పోరాడే వ్యక్తి పాత్రలో రజినీకాంత్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కథ తన తండ్రి జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారంటూ జవహర్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు.

తన తండ్రి ఎస్.తిరవియం నాడార్ ఓ వ్యాపారం చేసేవారని.. ముంబైలో ధారవి ప్రాంతవాసుల కోసం ఆయన ఎంతో చేశారని.. వారంతా ఆయనను ఒక తాతయ్యలా చూసుకునేవారని అన్నారు. ఇప్పుడు రజినీకాంత్ 'కాలా' సినిమా కూడా ఆలానే ఉండబోతుందని విని అందులో నిజాలు తెలుసుకోవడానికి దర్శకుడి కోసం ప్రయత్నిస్తే ఆయన స్పందించలేదని అన్నారు.

తన తండ్రి కథకు దగ్గర గనుక సినిమా ఉంటే పరువు నష్టం దావా కింద రజినీకాంత్ రూ.100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తానని అన్నారు జవహర్. ఇలా అడుగుతున్నందుకు తను ఇదంతా డబ్బు కోసం చేస్తున్నట్లు అనుకోవద్దని.. ఆ డబ్బుని ధారవి ప్రజల శ్రేయస్సు కోసం వినియోగిస్తానని స్పష్టం చేశారు. చిత్రబృందం దీనిపై స్పందించకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు.  

loader