దీపికా రణ్వీర్ ల పెళ్లి ముహూర్తం ఫిక్స్

deepika ranveer wedding ceremony date fixed
Highlights

దీపికా రణ్వీర్ ల పెళ్లి ముహూర్తం ఫిక్స్

బాలీవుడ్ యంగ్ జనరేషన్ తారలు ఒక్కొక్కరుగా తమ ప్రేమ పంట పండిస్తున్నారు. పవిత్రబంధంతో తమ ప్రేమను మార్చుకుంటున్నారు. ఇప్పటికే విరాట్-అనుష్కల పెళ్లి కూడా పూర్తయిపోగా.. మరో ప్రేమ జంట రణవీర్ సింగ్- దీపికా పదుకొనేలు కూడా ఇందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 

గతేడాది చివరలో విరుష్కల వివాహం జరిగితే.. ఈ ఏడాది చివరకు డీప్ వీర్ ఒకటి కాబోతున్నారట. రెండు నెలల క్రితమే.. అంటే సరిగ్గా పద్మావత్ మూవీ రిలీజ్ కు  ఓ వారం రోజుల ముందు ఓ పూజా కార్యక్రమం నిర్వహించారు రణవీర్ దీపిక. ఈ కార్యక్రమానికి అటు రణవీర్ పేరెంట్స్.. ఇటు దీపిక తల్లిదండ్రులు కూడా అటెండ్ అయారు. రీసెంట్ గా వీరంతా మరోసారి భేటీ అయ్యి వివాహం గురించి చర్చించుకున్నారట. సెప్టెంబర్ డిసెంబర్ మధ్యలో 4 ముహూర్తాలను ప్రపోజ్ చేశారని.. వీరి ప్రొఫెషనల్ షెడ్యూల్స్ ను అనుసరించి.. వీటిలో ఒకదాన్ని ఖాయం చేసుకోనున్నారని తెలుస్తోంది. 

ఇప్పటికే దీపికకు పెళ్లి డ్రెస్సుల డిజైనింగ్ తో పాటు.. ఆర్నమెంట్స్ ఆర్డర్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గా.. కేవలం  బంధువుల మధ్యే ఈ పెళ్లి జరిగే అవకాశం ఉండగా.. పెళ్లి తర్వాత ఓ రిసెప్షన్ ను ఏర్పాటు చేసి.. బాలీవుడ్ ను ఆహ్వానించబోతున్నారట. ఈ ఏడాది ముగిసేసరికి రణవీర్ సింగ్- దీపికా పదుకొనేలు ఒకటి కావడం ఖాయం అంటున్నారు. 

loader