దీపిక, రణవీర్ ల పెళ్లి.. అతిథులకు షరతులు ఏంటంటే..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 16, Aug 2018, 5:50 PM IST
deepika ranveer singh's wedding: no cell phones allowed
Highlights

అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకోనున్నారు. ఇరు కుటుంబ సభ్యులు కొందరు సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కానున్నారు. అయితే వారికి షరతులు విధిస్తుందట ఈ జంట.

బాలీవుడ్ అగ్ర హీరో, హీరోయిన్ దీపికా పదుకోన్, రణవీర్ సింగ్ లు చాల కాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఎప్పుడూ కూడా ఈ జంట తమ బంధాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని సమాచారం. ఇప్పటికీ కూడా ఆ విషయాన్ని వెల్లడించడానికి ఇష్టపడడం లేదు. నవంబర్ 20న ఈ జంట పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందని సమాచారం.

అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకోనున్నారు. ఇరు కుటుంబ సభ్యులు కొందరు సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కానున్నారు. అయితే వారికి షరతులు విధిస్తుందట ఈ జంట. అతిథులు ఎవ్వరూ కూడా తమ మొబైల్ ఫోన్స్ ని పెళ్లికి తీసుకురాకూడదని రూల్స్ పెడుతున్నారని తెలుస్తోంది. లేకపోతే తమ పెళ్లి ఫోటోలు లీక్ అయ్యే ఛాన్స్ ఉందని దీపికా, రణవీర్ లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో అనుష్క, విరాట్ ల పెళ్లి తరువాత సోనమ్, ఆనంద్ అహుజాల పెళ్లి జరిగింది. రీసెంట్ గా నేహా ధూపియా-అంగధ్ బేడీని వివాహం చేసుకుంది. ఇప్పుడు దీపికా, రణవీర్ లు కూడా ఈ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. 

loader