బాలీవుడ్ స్టార్ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపికా - రణ్ వీర్ నిరంతరం ఎదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. రీసెంట్ గా భార్య చెప్పులు మోసి హల్ ఛల్ చేసిన రణ్ వీర్ ఇప్పుడు భార్య మరొక వ్యక్తితో డ్యాన్స్ చేస్తుంటే గట్టిగా అరిచి ఇంటర్నెట్ ని షేక్ చేశాడు. 

అది కూడా దీపిక మాజీ లవర్ కావడంతో నెటిజన్స్ ఈ వీడియోపై ఊహించని విధంగా కామెంట్స్ చేస్తున్నారు. దీపిక తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రన్ బీర్ తో కలిసి ఏ జవాని హై దీవాని' సినిమా నుండి 'బలమ్ పిచికారి' సాంగ్ కి సెక్సీగా స్టెప్పులేసింది. ఒకప్పుడు వారు నటించిన సినిమా పాటే కావడంతో అందరూ విజిల్స్ తో సపోర్ట్ చేశారు. 

ఇక రణ్ వీర్ ఓ బేబీ అంటూ భార్య స్టెప్పులకు గట్టిగా అరిచేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Epic! #RanbirKapoor and @deepikapadukone groove to Balan Pichkari from their film #YJHD.

A post shared by Filmfare (@filmfare) on May 31, 2019 at 4:30am PDT