బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునేకు చాలా నిక్ నేమ్స్ ఉన్నాయి. తన పేరు ‘దీపికా పదుకునే’ కాగా,  చాలా మంది కొన్ని సందర్భాల్లో పలు పేర్లతో పిలుస్తున్నారంటూ ఈ సొట్టబుగ్గల బ్యూటీ తెలిపింది. 

పొడుగుకాళ్ల సుందరి, సొట్టబుగ్గల సోయగం దీపికా పదుకునే తన గ్లామర్ తో గ్లామర్ ఫీల్డ్ ను ఏలుతోంది. 2006లో రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి, కన్నడ, తమిళ్, హిందీ ప్రేక్షకులకు పరిచయమైంది దీపికా. 

అప్పటి నుంచి వరుస సినిమాల్లో తన అభినయం, అందంతో ఆడియెన్స్ ను మెప్పిస్తూనే వస్తోంది. తొలినాళ్లలోనే ‘ఓం శాంతి ఓం’మూవీతో బెస్ట్ ఫీమేల్ ఫిల్మ్ ఫేయిర్ అవార్డును దక్కించుకుంది. అప్పటి నుంచి బాలీవుడ్ స్టార్స్ షారూక్ ఖాన్, రన్ వీర్ సింగ్, హాలీవుడ్ లోనూ ప్రముఖ నటుడు విన్ డీసెల్ తో ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ మూవీలో ఆడిపాడింది. తన క్రేజ్ ను సినిమా సినిమాకు పెంచుకుంటూ పోతోంది. 

అయితే ప్రతి సినిమాలోతనకుంటూ ప్రత్యేక పాత్ర క్రియేట్ చేయడం, అందుకు తగ్గుట్టుగా దీపికా పాత్రలో ఒదిగిపోవడంతో ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. అప్పటి నుంచి పలువురు తన పేరుతో కంటే పలు సినిమాల్లోని క్యారెక్టర్ల నేమ్స్ తోనే దీపికాను పిలుస్తుంటారు. 

View post on Instagram

అయితే, ఇదే విషయాన్ని దీపికా కూడా తన ఇన్ స్టాలో పేర్కొంది. ‘తన పేరు దీపికా పదుకునే.. కానీ అప్పుడప్పుడు నిక్ నేమ్స్ తో పిలుస్తుంటారు. ఆ నిక్ నేమ్స్.. శాంతి ప్రియ, మీరా, విరోనికా, లీలా, నైనా తల్వార్, మీనమ్మ, పికు, అలిషా, వీటిలో మీకు ఏ పేరంటే ఇష్టం?’ అంటోంది దీపికా. ఇందుకు రణ్ వీర్ సింగ్ స్పందిస్తూ ఏ పేరుతో పిలవాలో చెప్పడం ‘చాలా కష్టం’ అని కామెంట్ లో తెలిపాడు. అదేవిధంగా కాలమిస్ట్, మోడల్ ‘శ్వేతా బచ్చన్’ స్పందిస్తూ ‘పికు’ నిక్ నేమ్ అంటే తనకు ఫేవరేట్ అని తేలిపింది. 

మరోవైపు దీపికా పదుకొనె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గెహ్రైయాన్'. ఫిబ్రవరి 11న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలయింది. అలాగే ‘గెహరియా’ టైటిల్ సాంగ్, డూబే సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాండ్ ను సొంతం చేసుకున్నాయి. కాగా, ఈ మూవీలో దీపికా పదుకొనె పాత్ర ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీపికా పదుకొనె, అనన్య పాండే ఈ చిత్రంలో కజిన్స్ గా నటిస్తున్నారు.