తనపై వచ్చే అసభ్య వ్యాఖ్యలను, ట్రోల్స్ ని అస్సలు సహించరు దీపికా పదుకొనె. చాలా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తారు. తాజాగా ఓ నెటిజన్ కి అలాంటి కౌంటరే ఇచ్చింది దీపికా. తనపై వస్తోన్న ట్రోల్స్ పై ఆమె స్పందించారు. తనకు ఇటీవల తరచూ అసభ్య కామెంట్లు ఎదురవుతున్నాయి. వాటిని ట్రోల్‌ చేస్తున్నారు. కొంత మంది ఆకతాయిలు కావాలని దీపిని టార్గెట్‌ చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేరుగా దీపికకే మెసేజ్‌లు పెడుతున్నారు. 

దీనిపై తాజాగా దీపికా స్పందించారు. వారు పెట్టిన మెసేజ్‌లు స్క్రీన్‌ షాట్లు తీసి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. `వాహ్‌.. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు, స్నేహితులు గర్విస్తారు` అని స్ట్రాంగ్‌గా రీప్లై ఇచ్చింది దీపికా. అయితే ఆ వెంటనే ఆ ఇన్‌ స్టోరీని డిలీట్‌ చేశారు. న్యూ ఇయర్‌ సందర్బంగా తన ట్విట్టర్‌, ఇన్‌స్టా స్టోరీస్‌లోని ఫోటోలన్నీ దీపికా డిలీట్‌ చేసింది. దీపికా చివరగా మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో రూపొందిన `ఛపాక్‌`లో నటించారు. అది సక్సెస్‌ కాలేదు. ప్రస్తుతం భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి `83`లో నటిస్తుంది. దీంతోపాటు హృతిక్‌తో `ఫైటర్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగులో ప్రభాస్‌తో నాగ్‌ అశ్విన్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది.