కల్కి 2 నా ఫస్ట్ ప్రయారిటీ కాదు, షాకిచ్చిన దీపికా పదుకొనె..ప్రభాస్ మూవీ గురించి ఏం చెప్పిందంటే

కల్కి చిత్రానికి పార్ట్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో కొన్ని ప్రశ్నలు అలాగే వదిలేశారు. అయితే పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. కానీ నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి 2 స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. 

Deepika Padukone Shocking Comments Kalki 2 dtr

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చివరి చిత్రం కల్కి 2898 ఎడి. నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీతో మహాభారతం, కల్కి అవతారం నేపథ్యంలో కల్పిత కథని వెండితెరపై ఆవిష్కరించారు. క్లైమాక్స్ లో ప్రభాస్ ని నాగ్ అశ్విన్ కర్ణుడిగా చూపించడం అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు. విజువల్స్ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంటూ మెప్పించాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. 

కల్కి 2 ఎప్పుడు మొదలవుతుంది ?

కల్కి చిత్రానికి పార్ట్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో కొన్ని ప్రశ్నలు అలాగే వదిలేశారు. అయితే పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. కానీ నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి 2 స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. కల్కి 2 కంప్లీట్  అయ్యే వరకు మరో ప్రాజెక్ట్ చేయనని కూడా చెప్పారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి అంత పెద్ద విజయం అందించిన చిత్రం కల్కి నే. దీనితో పార్ట్ 1 కి మించేలా పార్ట్ 2 ఉండేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేసుకుంటున్నారు. 

పార్ట్ 1 లో దీపికా పదుకొనె పాత్ర అంతంత మాత్రమే ఉంటుంది. అయితే కల్కి 2లో ఆమె పాత్ర అత్యంత కీలకం అని అంతా భావించారు. తాజాగా కల్కి 2 పై దీపికా పదుకొనె చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులకు షాకిచ్చేలా ఉన్నాయి. ఇటీవల దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. పెళ్ళైన ఆరేళ్లకు దీపికా పదుకొనె పాపకి జన్మనిచ్చింది. ఈ పాపకి దువా అనే పేరు పెట్టింది. దువా అంటే ప్రార్థన అనే అర్థం వస్తుంది. 

కల్కి 2 నాకు ఫస్ట్ ప్రయారిటీ కాదు 

తన పాపని పరిచయం చేయడం కోసం దీపికా, రణ్వీర్ జంట గెట్ టు గెదర్ మీటింగ్ ఏర్పాటు చేశారట. ఈ మీటింగ్ లో మీడియా ప్రతినిధులు కల్కి 2 గురించి అడిగారు. దీనితో దీపికా పదుకొనె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కల్కి 2 కోసం నేను కూడా ఎదురుచూస్తున్నా. కానీ అది నా ఫస్ట్ ప్రయారిటీ కాదు. 

నా కుమార్తె దువానే నాకు ఫస్ట్ ప్రయారిటీ. నా కూతురిని పెంచడం కోసం ఆయాని నియమించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నన్ను మా అమ్మ పెంచినట్లుగానే నేను స్వయంగా దువాని పెంచాలి అని దీపికా పేర్కొంది. కొంత సమయం వరకు దువాతో గడపాలని దీపికా భావిస్తోందట. నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం అయితే ఈ లోగా దీపికా తన కుమార్తె ఆలనాపాలనా చూసుకుంటుంది. మరి నాగ్ అశ్విన్ కల్కి 2 చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో అనేది సస్పెన్స్. 

కల్కి 2 టైటిల్ మారుతుందా ?

మరికొందరు చెబుతున్నది ఏంటంటే కల్కి 2లో కూడా దీపికా పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు అని చెబుతున్నారు. రెండవ భాగానికి కల్కి 2 కాకుండా మరో టైటిల్ ఫిక్స్ అయిందని అంటున్నారు. అదేంటంటే 'కర్ణ 3102 BC' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. కల్కి టైటిలే కల్కి 2898 AD అని ఉంటుంది. కానీ కర్ణ 3102 BC ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడే దిమ్మతిరిగే ట్విస్ట్ ఉండబోతోంది. కథ కంప్లీట్ గా కలియుగం నుంచి గతంలోకి అంటే మహాభారతంలోకి వెళుతుందట. 

Also Read : రాంచరణ్ తో స్టన్నింగ్ లుక్ లో స్టార్ డైరెక్టర్ కూతురు, ఒక్క సినిమా ప్లీజ్ అంటున్న ఫ్యాన్స్..వైరల్ ఫోటోస్

 'కర్ణ 3102 BC' లో నాగ్ అశ్విన్ ఎక్కువగా మహాభారత సన్నివేశాలని..కర్ణుడు, అశ్వథామ మధ్య ఏం జరిగింది అనే కథని చూపించబోతున్నారట. అదే విధంగా కమల్ హాసన్ యాస్కిన్ పాత్రకి సంబందించిన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట. కథ కలియుగం నుంచి మహాభారతంలోకి అంటే భవిష్యత్తు నుంచి గతంలోకి వెళుతుంది కాబట్టి టైటిల్ లో బిసి అని వచ్చేలా చేశారు.  ఇటీవల స్వప్న, ప్రియాంక దత్ కూడా కల్కి 2 గురించి స్పందించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది అని తెలిపారు. సాధారణ భైరవ గా ఉన్న ప్రభాస్ కర్ణుడిగా ఎలా మారాడు అనేది పార్ట్ 2లో ఉత్కంఠని రేకెత్తించే అంశం. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios