ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌తో చేస్తుంది దీపికాపదుకొనె. నెక్ట్స్ తన డ్రీమ్‌ హీరో ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయబోతుందట. తాజాగా ఈ విషయాన్ని ఉమైర్‌ సందు వెల్లడించారు. 

ఒకప్పుడు బాలీవుడ్‌ అంటే ఇండియన్‌ సినిమాని రిఫ్లెక్ట్ చేసేది. సౌత్‌ హీరోయిన్లు, హీరోలు కూడా బాలీవుడ్‌లో సినిమాలు చేయాలని కోరుకునేవారు. కానీ పరిస్థితులు మారాయి. బాలీవుడ్‌ తారలే తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. `బాహుబలి` తర్వాత సీన్‌ రివర్స్ అయ్యింది. ఇండియన్‌ సినిమాకి టాలీవుడ్‌ ప్రతిబింబంగా నిలుస్తుంది. `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `పుష్ప`, అంతకు ముందు వచ్చిన `సాహో`, ఇప్పుడొస్తున్న `సలార్‌`, `లైగర్‌` వంటి చిత్రాలు అందరి అటెన్షన్‌ని గ్రాస్ప్ చేస్తున్నాయి. అందుకే బాలీవుడ్‌ తారలు తెలుగు తెరపై మెరిసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. 

ఇప్పటికే అలియాభట్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో మెరిసింది. విద్యా బాలన్‌, కియారా, కృతి సనన్‌, శ్రద్ధా కపూర్‌, జాక్వెలిన్‌, నర్గీస్‌ ఫక్రీ వంటి కథానాయికలు తెలుగులో మెరిశారు. దీపికా పదుకొనె సైతం ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే` చేస్తుంది. ఇప్పుడు ఆమె మరో టాలీవుడ్‌ సినిమాకి కమిట్‌ అయ్యిందని తెలుస్తుంది. తన డ్రీమ్‌ హీరో ఎన్టీఆర్‌తో జోడీ కట్టబోతుందట. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ చిత్రంలో నటించబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. ఇందులో అలియాభట్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 

మరోవైపు `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తోనూ ఓ సినిమా చేయనున్నారు తారక్‌. ఇది ఆయనకు 31వ సినిమా. ఇందులో దీపికా పదుకొనెని హీరోయిన్‌గా ఫైనల్‌ చేశారని టాక్‌. అయితే దీనికి బలం చేకూరుస్తూ ఓవర్సీస్‌ క్రిటిక్‌గా, సెన్సార్‌ బోర్డ్ మెంబర్‌గా చెలామణి అవుతున్న ఉమైర్‌ సందు ఈ విషయాన్ని చెబుతూ ట్వీట్‌ చేశారు. `ఎన్టీఆర్‌ ఇప్పుడు ఇండియన్‌ సినిమాలో సూపర్‌ హాట్‌గా మారారు. ఆయన బాలీవుడ్‌ క్వీన్‌ దీపికా పదుకొనెతో రొమాన్స్ చేయబోతన్నారు. ఎన్టీఆర్‌ 31 చిత్రంలో దీపికా నటిస్తుంది. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది` అని తెలిపారు. 

Scroll to load tweet…

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌తో `సలార్‌` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్‌ వరకు షూటింగ్‌ పూర్తి చేసి, డిసెంబర్‌లో తారక్‌ సినిమాని పట్టాలెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారట ప్రశాంత్‌ నీల్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇది సూపర్‌ హాట్‌ న్యూస్‌గా మారింది. ఇదిలా ఉంటే ఆ మధ్య ఎన్టీఆర్‌పై దీపికా హాట్‌ కామెంట్‌ చేసింది. తారక్‌ పర్సనాలిటీ అంటే ఇష్టమని బోల్డ్ గా చెప్పేసింది. ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. కోరికని చెప్పడమే కాదు, ఛాన్స్ రావడంతో ఓకే చెప్పిందని టాక్‌. 

ఇందులో ఎన్టీఆర్‌ పాత్రసరికొత్తగా ఉంటుందట. ఎప్పుడూ కనిపించని కొత్త మేకోవర్‌లో ఆయన కనిపించబోతున్నారని టాక్‌. ఎన్టీఆర్‌ ఇటీవలే `ఆర్‌ఆర్‌ఆర్‌`తో మెప్పించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ఆయనకు పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. మరోవైపు దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తుంది. తెలుగులో `ప్రాజెక్ట్ కే`తోపాటు షారూఖ్‌ ఖాన్‌తో `పఠాన్‌` సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు `ఫైటర్‌` చిత్రంలో నటిస్తుంది.